నంద్యాలలో బంద్ విజయవంతం

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

కేంద్ర ప్రభుత్వం రైతులకు  వ్యతిరేకంగా చేసిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని భారతదేశ వ్యాప్తంగా దాదాపు 500 ల రైతు సంఘాల  ఆధ్వర్యంలో భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. బందు కు మద్దతుగా ఈరోజు నంద్యాలలో ఉదయం 6 గంటల నుండి  ఆర్ టి సి బస్టాండ్ దగ్గర వామపక్ష పార్టీలు. కాంగ్రెస్ పార్టీ .అబ్దుల్ సలాం న్యాయపోరాట కమిటీ. ఐఎంయూఎల్ . ముస్లిం సంఘాలు .విద్యార్థి .యువజన.కార్మిక . సంఘాల ఆధ్వర్యంలో 10 గంటల వరకు నిర్వహించి అనంతరం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నంద్యాలలో 8 సెంటర్లలో టీములుగా నిగిడిపోయి బంద్ నిర్వహించారు. నంద్యాల లోని పాతపట్నంలో సిపిఐ, సిపిఎం ఐఎంయూఎల్  పార్టీల ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా నిర్వహించారు. అదేవిధంగా మిగతా సెంటర్ లో కూడా వామపక్ష పార్టీలు విద్యార్థి యువజన సంఘా లు కార్మిక సంఘాలు ముస్లిం మైనార్టీ సంఘాలు ఆధ్వర్యంలో  బందు విజయవంతమైంది. ఇదిలావుంటే బంద్ కు సహకరించిన పట్టణ ప్రజలకు విప్లవ అభివందనాలు అని సీపీఐ నంద్యాల పట్టణ కార్యదర్శి కె.ప్రసాద్ తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: