ఉమర్ ఫారుఖ్ ఖాన్ కు...

శ్రీకృష్ణ దేవరాయ జాతీయ ఉత్తమ సేవా పురస్కారం

(జానోజాగో వెబ్ న్యూస్-పెనుగొండ ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన సంఘ సేవకుడు, ముస్లిం నగరా నేత ఉమర్ ఫారుఖ్ ఖాన్ కు  శ్రీకృష్ణ దేవరాయ జాతీయ ఉత్తమ సేవా పురస్కారం 2020 లభించింది. ఈ మేరకు పెనుకొండ పట్టణం లోని నామారామయ్య ఫంక్షన్ హాల్ లో మనం ఫౌండేషన్&మదర్ ఛారిటి బుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన జాతీయ శ్రీ కృష్ణ దేవరాయ  ఉత్తమ సేవా పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు కవి రచయిత బిక్కి కృష్ణ చేతుల మీద  శ్రీ కృష్ణ దేవరాయ జాతీయ ఉత్తమ సేవా పురస్కారం 2020 ఉమర్ ఫారుఖ్ ఖాన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దాదాపు 20సంవత్సరాల నుంచి 51సారి రక్తదానం చేసి వందలాది రక్తదాన చైతన్య కార్యక్రమాలు చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు కోవిడ్ శవాలను కుల మతాలకు అతీతంగా వారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ  శుభ కార్యాలలో మిగిలిన ఆహారపదార్థాలు అన్నార్తులకు అందజేస్తూ మతోన్మాద కులోన్మాద తీవ్రవాద నిర్మూలనా కార్యక్రమాలు మత సామరస్య పరమత సహనం సోదరభావం వసుధైక కుటుంబం పెంపొందించే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవలకు సామాజిక చైతన్య కార్యక్రమాల కు గుర్తింపుగా  జాతీయ స్థాయిలో  ఢిల్లీ లో 2019జ్యోతీరావు పూలే జాతీయ పురస్కారం.

 


ఉత్తమ రక్తదాత పురస్కారం కలెక్టర్ వీరపాండ్యన్ గారి చేతుల మీద ఉగాది సాహిత్య పురస్కారం.అనంత సాహిత్య పురస్కారం.జనవిజ్ఞాన వేదిక ద్వారా రాయలసీమ సేవా రత్నం పురస్కారం .ఫెర్రర్ గారి చేతులమీద సేవా పురస్కారం.2018బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పురస్కారం.2019అంబేద్కర్ మనుముడు రాజరత్న అంబేద్కర్ చేతులమీద అంబేద్కర్ రత్న జాతీయ సేవా పురస్కారం.దాదాపు వందకు పైగా పురస్కారాలు సామాజిక సేవలకు గాను అందుకున్నానని ఇక ముందుకు కూడా సేవలు కొనసాగిస్తూ రాష్ట్రమంతటా మత సామరస్యం .పరమత సహనం.సోదరభావం. పెంపొందించటానికి ఆచరణాత్మక ప్రయత్నం కొనసాగిస్తానని నా సేవలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కవులు రచయితలు మేధావులు సామాజిక సేవకులు వందలాది మంది పాల్గొన్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు అభినందనలు తెలిపారు.





 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: