మంత్రి బాలినేని జన్మదినం సందర్భంగా సేవ కార్యక్రమాలు చేయండి

పార్టీ నేతలు కార్యకర్తలకు రాష్ట్ర వైసీపీ నేత డాక్టర్ ఏలూరి పిలుపు(జానో జాగో వెబ్ న్యూస్ -విజయవాడ ప్రతినిధి)

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తపిస్తూ పనిచేస్తూ మరోవైపు నిస్వార్థ రాజకీయాలకు ప్రతిరూపమైన రాష్ట్ర విద్యుత్ శాఖ బాలినేని శ్రీనివాస రెడ్డి జన్మదినం సందర్భంగా  ఈ నెల 12 వ తేది శనివారం  పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూ-

 

రి రామచంద్రారెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు శుక్రవారం ఒక ప్రకటన లో పిలుపునిచ్చారు. రక్త దానశిబిరాలు, వైద్యాశాలలో రోగులకు పండ్లు పంపిణీ, అనాధాలకు బట్టలు పంపిణీ ముఖ్యంగా నివార్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేయాలన్నారు. 

బాలినేని జన్మదిన వేడుకలను ప్రకాశం జిల్లాలో ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేందుకు పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ప్రజా ముద్దుబిడ్డ మంత్రి బాలినేనికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: