యూసుఫ్ బాబు, అగస్టీన్ కు ఎం.జె.ఎఫ్ సత్కారం 

(జానోజాగో-వెబ్ న్యూస్ భువనగిరి ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరహా  న్యూస్ పేపర్సు మరియు మ్యాగజైన్సు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ఉపాధ్యక్షులు అగస్టీన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గురువారం భువనగిరి గెస్ట్ హౌస్ లో మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ (ఎం.జె.ఎఫ్) జిల్లా అధ్యక్షులు ఎం.డి .అఖిల్ పాషా ఆధ్వర్యంలో చిన్న  పత్రికల ప్రతినిధులను  ఘనంగా సత్కరించారు.. ఈ  సందర్భంగా యూసుఫ్ బాబు మాట్లాడుతూ చిన్న మధ్య తరహా పత్రికలకు,మ్యాగజైన్లకు ప్రభుత్వపరంగా ప్రకటనలు, పాత్రికేయులకు అక్రిడిటేషన్లు  సమకూర్చే విధంగా సంఘం ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుంది అన్నారు. టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ గారి నాయకత్వంలో జర్నలిస్టుల సమస్యలతో పాటు ప్రాంతీయ పత్రికలు, మ్యాగజైన్ సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోందని యూసుఫ్ బాబు వివరించారు. కరోనా పాజిటివ్ బారిన పడిన జర్నలిస్టులకు దాదాపు 1700 మందికి మూడున్నర కోట్ల రూపాయల సహాయం అందచేసారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఎం. డి ఖాజా, ఇబ్రహీం, హమీద్, నవీన్, మధు, షానూర్ , ఖదీర్ ,ముజీబ్ , ఇసాక్ , అలీమ్, ఇంతియాజ్ , సుజా ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: