మ్యూజిక్ సిట్టింగ్‌లో ర‌వితేజ 'ఖిలాడి'

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ రూపొందిస్తున్న‌ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'ఖిలాడి'. ర‌వితేజ డ‌బుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. జ‌యంతీలాల్ గ‌డ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. 'ప్లే స్మార్ట్' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న 'ఖిలాడి' మూవీకి సంబంధించి ఓ షెడ్యూల్ షూటింగ్ జ‌రిగింది. ప్ర‌స్తుతం చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయి. సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ ఇందులో పాల్గొంటున్నారు. ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి, డింపుల్ హ‌య‌తి నాయ‌క‌లుగా న‌టిస్తున్నారు. ఉన్న‌త స్థాయి టెక్నిక‌ల్ విలువ‌ల‌తో ర‌మేష్ వ‌ర్మ 'ఖిలాడి'ని ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా తీర్చిదిద్దేందుకు శ్ర‌మిస్తున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, 'లూసిఫ‌ర్' ఫేమ్ సుజిత్ వాసుదేవ్‌, అగ్ర‌శ్రేణి ఫైట్ మాస్ట‌ర్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్ వంటి టాప్ టెక్నీషియ‌న్ల‌తో ఆయ‌న ప‌నిచేస్తున్నారు. శ్రీ‌కాంత్ విస్సా, దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్‌ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీ‌మ‌ణి సాహిత్యం అందిస్తున్నారు. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. 'రాక్ష‌సుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతో త‌మ‌ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్ అని స‌త్య‌నారాయ‌ణ కోనేరు, ర‌మేష్ వ‌ర్మ నిరూపించారు. ఇప్పుడు 'ఖిలాడి' చిత్రాన్ని ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్‌తో, ఉన్న‌త ప్ర‌మాణాల‌తో తీస్తున్నారు.  తారాగ‌ణం: ర‌వితేజ‌, మీనాక్షి చౌధ‌రి, డింపుల్ హ‌య‌తి, సాంకేతిక బృందం:క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ర‌మేష్ వ‌ర్మ, నిర్మాత‌: స‌త్య‌నారాయ‌ణ కోనేరు, బ్యాన‌ర్లు: ఏ స్టూడియోస్‌, పెన్ స్టూడియోస్‌, ప్రొడ‌క్ష‌న్‌: హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, స‌మ‌ర్ప‌ణ‌: డాక్ట‌ర్ జ‌యంతీలాల్ గ‌డ‌, మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ వాసుదేవ్‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, డైలాగ్స్‌: శ్రీ‌కాంత్ విస్సా, సాగ‌ర్‌, ఎడిటింగ్‌: అమ‌ర్ రెడ్డి, పాట‌లు: శ్రీ‌మ‌ణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ముర‌ళీకృష్ణ కొడాలి, ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: