ఆ బిల్లులు కార్యరూపం దాల్చితే...

రైతుల ఉనికికే ప్రమాదం...

రైతు సంఘాల కోఆర్డినేటర్ కమిటీ

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి) 

పార్లమెంటులో వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులు కార్యరూపం దాల్చితే రైతుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని , వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుందని, రైతు సంఘాల కోఆర్డినేటర్ కమిటీ నాయకులు ఎం నాగేశ్వరరావు, రఘురాం మూర్తి, వెంకటేశ్వర్లు, మజీద్ మియా అన్నారు, సోమవారం స్థానిక పటేల్ సెంటర్ లో రైతు గర్జన సభ రాజు అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతులకు సంకెళ్లు వేస్తూ కంపెనీలకు స్వేచ్ఛను ఇస్తూ పార్లమెంటులో నూతన వ్యవసాయ చట్టాలను ఆమోదించింది వీటికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న తరుణంలో 35 మంది రైతులు అసువులు బాసిన నరేంద్ర మోడీకి చీమ కుట్టినట్టు గా లేదని వారు విమర్శించారు, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో 20 20 విద్యుత్ సవరణ చట్టం తో ఇప్పటి వరకు రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్ రంగం కేంద్రం గుప్పిట్లోకి పోతుంది అన్నారు.

 రైతులు, దళితులు, గిరిజనులు, చిన్న పరిశ్రమలు పొందుతున్న విద్యుత్ రాయితీలు తొలగించబడతాయి, రిలయన్స్ అంబానీ ఆ దాని గ్రీన్ కు వంటి స్వదేశీ విదేశీ ప్రైవేటు విద్యుత్ కంపెనీల చేతిలోకి రంగం పోతుంది అన్నారు, తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతులను చర్చలకు పిలిచి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నారు లేనిపక్షంలో వ్యవసాయ చట్టాలు వద్దు అయ్యేంతవరకు పోరాటాలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘాల కోఆర్డినేటర్ కమిటీ నాయకులు రమేష్ బాబు వై నరసింహులు కె భాస్కర్ రెడ్డి గోపాల్ శ్రీనివాసులు ఆది బి బి సూరి బి రజిత ఈశ్వరమ్మ పి పకీర్ సాహెబ్ తదితర రైతులు పాల్గొన్నారు,

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: