నంద్యాల పట్టణంలో పండగ వాతావరణంలో

పేదలకు ఉచిత టిడ్కో గృహాలు పంపిణీ

పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించాలన్నదే సీఎం లక్ష్యం 

జిల్లా జాయింట్ కలెక్టర్ రమసుందర్ రెడ్డి

నంద్యాల  శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కలను సాకారం చేసి, శాశ్వత గృహ వసతి కల్పించాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి  నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. ఆదివారం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పంపిణీ కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గం నంద్యాల మండల కేంద్రం లో టిడ్కో గృహాల అగ్రిమెంట్ పత్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆదివారం టౌన్ హాల్ నందు పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్  రాము సుందర్ రెడ్డి నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ భాష నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి,  నంద్యాల తాసిల్దార్ రవికుమార్   అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం లో భాగంగా  ఈరోజు  నంద్యాల పట్టణంలో  టిడ్కో వారిద్వారా నిర్మించుకున్న  గృహాలు 300 చదరపు అడుగుల గృహాలు8081.  365 చదరపు అడుగుల గృహాలు162. 430 చదరపు అడుగులు గృహాలు 323లకు సేల్ అగ్రిమెంట్లు పంపిణీ చేస్తున్నామన్నారు నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా జిల్లాలో మొత్తం 2,07,490 మంది అర్హులైన పేద మహిళలకు వైఎస్సార్ ఇళ్ల పట్టాలను, ఇళ్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందులో 1,61,000 మందికి ఇంటి పట్టాల రూపంలో అందిస్తున్నామన్నారు. అలాగే 29,066 టిడ్కో ఇళ్లను, 17,174 పొజిషన్ సర్టిఫికెట్ లను కూడ ఇస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గారు తెలిపారు. . ఇందులో ప్రభుత్వ భూమి మొత్తం ఎకరాలు 2966.19, భూమి కొనుగోలు కింద ఎకరాలు 1026.38 కలదన్నారు.  ప్రభుత్వ మరియు భూసేకరణ భూమి మొత్తం 3612.57 ఎకరాలు ఉండగా అందులో భూసేకరణ భూమి కోసం 160.50 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. దీన్ని కోసం మొత్తం 882 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలని ఉద్దేశంతో మొదటి విడతలో మన కర్నూలు జిల్లాకు 98,000 మందికి ఇంటి నిర్మాణం చేపడుతున్నమన్నారు.

ఇల్లు కట్టడానికి మొదటి విడతలో 1770 కోట్లు ప్రభుత్వం కేటాయించదన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇంటి నిర్మాణాలకు మూడు వేల కోట్లు కేటాయిస్తున్నారు. టిడ్కో ఇళ్లకు 15 వందల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఈ రకంగా చూస్తే ఇల్లు నిర్మాణం చేపట్టడానికి 5,600 కోట్ల  రూపాయలు ఖర్చు పెడుతున్నారు.  ఎవరు కలలో కూడా ఊహించని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారన్నారు. అర్హులై ఉండి ఇంటి స్థలం మంజూరు కాకపోతే తమ సమీపంలోని వార్డ్ సచివాలయం లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామన్నారు. లబ్దిదారుని కోరిక మేరకు ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి లేఔట్ కాలనీ ఒక గ్రామంగా తయారవుతుందని ఆ కాలనీలో అన్ని రకాల మౌళిక వసతులు ఏర్పాటు చేస్తామని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇంట్లో కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో దాదాపు19796  మందికి ఉచిత ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో టిడ్కో వారు నిర్మించిన గృహాలు 300 చదరపు అడుగుల గృహాలు8081 మందికి 365 చదరపు అడుగులు గృహాలు 162 మందికి 430 చదరపు అడుగుల గృహాలు 323 మందికి షెల్ అగ్రిమెంట్ పత్రాలను కూడా పంపిణీ గావించుకుటున్నామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ మహా యజ్ఞంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 30 లక్షల75 వేల మందికి పైగా ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఇంటి పట్టాలు పంపిణీ తో పాటు ఇంటి నిర్మాణం చేపట్టి ఆ కాలనీలో మౌలిక వసతులు అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. . అర్హులైన పేదలందరికీ నవరత్నాల పథకం కింద అనేక సంక్షేమ పథకాలు నేరుగా పేదలకు అందుతున్నాయని అన్నారు. పిల్లలను చదివించేందుకు అమ్మ వడి పథకం కింద తల్లి ఖాతా కు 15 వేల రూపాయలు జమ చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ 45 సంవత్సరాలు మించిన మహిళలకు చేయూత పథకం కింద రూ.18,750 ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందన్నారు. పొదుపు మహిళలకు సంబంధించి బకాయిలను రద్దు చేశారన్నారు. పొదుపు మహిళలు తీసుకున్న రుణానికి సున్నా వడ్డీ  అమలు చేస్తున్నారన్నారు. రైతులకు సంబంధించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు దళారీల బెడద నుండి ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతు భరోసా పథకం కింద 13,500 పెట్టుబడి సహాయం అందజేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. 


ప్రభుత్వ పాఠశాలలను నాడు - నేడు పథకం ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నమానరు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నంద్యాల పట్టణంలోని వార్డు సచివాలయ సిబ్బంది వైఎస్ఆర్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: