మైనార్టీ హక్కుల దినోత్సవాన్ని పురష్కరించుకొని...

సేవా మూర్తులకు ఘన సన్మానం

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

అంతర్జాతీయ మైనార్టీ హక్కుల దినోత్సవం సంధర్భంగా మైనార్టీ నాయకులు సంఘసేవకులు అబ్దుల్ సమద్, కవి మహబూబ్ బాషాను పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  డాక్టర్ చింతల మోహన్ రావు ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మైనార్టీ హక్కుల దినోత్సవాన్ని నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి షేక్ మస్తాన్ అధ్యక్షుతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల మోహనరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వాసు ఆధ్వర్యంలో నంద్యాల జమాఆతె ఇస్లామీ కార్యదర్శి, సామాజిక సేవకులు షేక్ అబ్దుల్ సమద్ , కవి షేక్ మహబూబ్ బాషాను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో    జాన్ జాగో ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, ఐయూయంయల్ నాయకులు ఖాజా, అక్బర్ ఖాన్,రాష్ట్ర సేవ దళ్ కార్యదర్శి మస్తాన్ ఖాన్ పాల్గొన్నారు.





  జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ 18 డిసెంబర్ 1992 న, ఐక్యరాజ్యసమితి మతపరమైన లేదా భాషా జాతీయ లేదా జాతి మైనారిటీలకు చెందిన వ్యక్తి హక్కులపై ప్రకటనను స్వీకరించింది. ఇది మైనారిటీల యొక్క మతపరమైన భాషా, సాంస్కృతిక మరియు జాతీయ గుర్తింపును హైలైట్ చేసింది, ఇవి రాష్ట్రాలచే మరియు వ్యక్తిగత భూభాగాలలో గౌరవించబడతాయి, సంరక్షించబడతాయి మరియు రక్షించబడతాయిమైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ:ఈ మంత్రిత్వ శాఖ 29 జనవరి 2006 న స్థాపించబడింది. ఇది సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నుండి రూపొందించబడింది. అన్నారు.







 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: