యూట్యూబ్‌ను ఊపేస్తున్న....

‘డించక్.. డించక్‌‌’

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా ప్రతినిధి)

మొన్నటివరకూ లవర్‌బాయ్‌గా ఉన్న రామ్‌ పోతినేని ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఒక్కసారిగా మాస్‌ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు మరోసారి అదే తరహాలో ద్విపాత్రాభినయంలో డబుల్‌ దమాకా ఇచ్చేందుకు వస్తున్నాడు. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రెడ్‌’ సినిమాలో నటిస్తున్నాడు రామ్‌. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆసక్తి రేపగా.. ‘వాడూ వీడూ బ్యాడు..’ అంటూ విడుదలైన పాటకు కూడా మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం మరోపాటను విడుదల చేసింది. ‘డించక్‌.. డించక్‌’ అంటూ సాగే పాటలో హెబ్బాపటేల్‌తో కలిసి రామ్‌ స్టెప్పులేశాడు. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. గతంలో రామ్‌, కిషోర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. హ్యాట్రిక్‌ విజయం కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. రామ్‌కు జోడీగా నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ ముగ్గురు భామలు సందడి చేయనున్నారు. స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: