అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి

జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ ఎం .శ్రీనివాసులు



(జానో జాగో వెబ్ న్యూస్- తర్లుపాడు ప్రతినిధి)

         ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని కలుజువ్వలపాడు సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయం-2. నందు ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవాలని జవహర్ నవోదయ విద్యాలయం-2 ప్రిన్సిపాల్  ఎం. శ్రీనివాసులు   మీడియా సమావేశం నందు తెలియజేశారు .

 


ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసులు  మాట్లాడుతూ జవహర్ నవోదయ విద్యాలయం-2 నందు విద్యార్థులకు  విద్యతో పాటు,  మరియు చదువుతోపాటు, వ్యవసాయంపై అవగాహన మెలుకువలు. రైతులు పడుతున్న కష్టాలు . తెలుసుకొనుటకు విద్యాలయంలో ఉన్న ఒక వైపు ప్రాంతంలో నాలుగు రకాల కూరగాయల  పంటలను   పండిస్తున్నారని  గ్రామీణ మూలాలను రైతుల యొక్క శ్రమను కష్టపడి పండించి ఆ పంట నుండి వచ్చే కూరగాయలను తినడం వలన వచ్చేఆనందాన్ని, విద్యార్థులు పొందుతారని, ఈ ప్రత్యేకమైన వ్యవసాయ కార్యక్రమం. చేపట్టినట్లు  విద్యాలయ ప్రిన్సిపాల్ ఎం. శ్రీనివాసరావు  తెలియజేశారు.



                       

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: