దివ్యాంగ విద్యార్ధులకు ఉచితంగా పరికరాలు

అర్హులను గుర్తించేందుకు...

“ ఎ.పి.సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం “ ఆధ్వర్యములో శిభిరం

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లాలోని దివ్యాంగ విద్యార్ధులకు ఉచితంగా పరికరాలు పంపిణీ చేసేందుకు “ ఎ.పి.సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం “ ఆధ్వర్యములో అర్హులను గుర్తించేందుకు బుధవారం మార్కాపురం పట్టణములోని స్ధానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. మార్కాపురం డివిజన్ పరిధిలోని అన్ని మండలాల నుండి వందలాది మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ధారణ శిబిరానికి హాజరయినారు.
ఈ శిబిరములో శారీరక విభాగం, వినికిడి లోపం, బుద్ది మాంద్యం, దృష్టి లోపం గల విద్యార్ధులకు ఆయా విభాగాల వైద్యుల సమక్షములో నిర్ధారణ పరిక్షలు నిర్వహించి సుమారు 200 మంది అర్హులను గుర్తించారు. “ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం “ ఆధ్వర్యములో ఉచిత ఉపకరణాలకు సంబంధించి అర్హులైన విద్యార్ధులకు 20,00,000 లక్షల రూపాయాలు వెచ్చించి “ అలీం కో  సంస్ధ ద్వారా సేకరించి పంపిణీ చేస్తామని సహిత విద్యా కో ఆర్డినేటర్ ఎం.రమేష్, సహాయ కో ఆర్డినేటర్ ఎన్.వి. రామిరెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 600 మంది దివ్యాంగులకు ఈ ఉపకరణాలతో లబ్ది చేకూరుతుందని వారు పేర్కొన్నారు.
ప్రత్యేక అవసరాలుగల పిల్లలు మండల కేంద్రాలలోని భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. భవిత కేంద్రాలలో విద్యార్ధులకు అందించే ప్రత్యేక విద్యా ఉచిత ఫిజియోధెరపీ సేవలను వినియోగ్ంచుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమములో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మునగాల చంద్రశేఖర రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యూరేషన్ ఉపాధ్యాయుడు వరిమడుగు వెంకట రామిరెడ్డి. ఐ.ఇ.ఆర్.టి. రిసోర్స్ పర్సన్ డి. లక్ష్మీదేవి, ఉపాధ్యాయ బృందంతో పాటు బోధనేతర సభ్యులు వై. రమేష్ రెడ్డి, పాఠశాల పేరంట్ కమిటీ ఎక్స్ ఆఫిషియో సభ్యులు షేక్. గౌస్ బాష పాల్గోన్నారు.
ఈ కార్యక్రమములో సైకాలజిస్ట్ సుస్మిత, ఆడియాలజిస్ట్ రత్న కుమారి, ఆప్తాలమాలజిస్ట్ బి. సుదర్శన రెడ్డి, ఎ.గురుస్వామి, పి. శ్రీనివాస గౌడ్, ఫిజియోధెరపిస్టులు ప్రవీణ్ కుమార్, కోటేశ్వర రావు, అంకారావు తదితరులు వైద్యసేవలు అందించారు. ఈ కార్యక్రమములో జిల్లాలోని రిసోర్స్ పర్సన్ లు, స్కూల్ అసిస్టెంటు లు మరియు తదితరులు పాల్గోన్నారు.




రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్

ప్రకాశం, గుంటూరు జిల్లాల బ్యూరో ఇన్ ఛార్జ్

 

 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: