ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. చింతామోహన్ రావు 

మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతామోహన్ రావు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిలను అరెస్ట్ చేయడం వైసిపి ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. చింతామోహన్ రావు ఆరోపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిని అమరావతిలో కొనసాగించాలని, అలాగే రాజధాని ప్రాంతంలోని ప్రజల యొక్క సమస్యల గురించి ముఖ్యమంత్రితో చర్చించడానికి గత వారం రోజుల క్రితం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసి 5న మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరినా దానికి ఎటువంటి సమాధానం ముఖ్యమంత్రి దగ్గరనుంచి రాకపోవడంతో అందుకు నిరసనగా స్వయంగా పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అలాగే ఇతర ముఖ్య పార్టీ నాయకులతో కలిసి అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడేందుకు వెళ్తున్న శైలజనాథ్ ను మంగళగిరిలో, అలాగేమస్తాన్ వలిని గుంటూరులో అరెస్ట్ చేయడం వైసీపీ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి, సమస్యలను వివరించడానికి అవకాశం కలిపించకపోవడం సమంజసం కాదని, పోలీసుల చేత అరెస్ట్ చేయించి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర పిసిసి చీఫ్ గా ఉన్న డాక్టర్ శైలజనాథ్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న  మస్తాన్వలిని అలాగే రాజీవ్ రతన్ తదితర నేతలను పోలీసులు లారీలో ఎక్కించి తీసుకెళ్లడం హేయమైన చర్య అని, దీనికి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని, అలాగే అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డాక్టర్ చింతల మోహన్ రావు డిమాండ్ చేశారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: