సచివాలయాలకు వచ్చే సమస్యలను..
సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ వీరపాండియన్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
సచివాలయ సిబ్బంది సచివాలయలకు వచ్చే ప్రజల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ నంద్యాల తాసిల్దార్ రవి కుమార్ తో కలిసి నంద్యాల పట్టణంలోని 26, 27, 29, 30 వార్డులోని సచివాలయాలను ఆకస్మిక తనిఖీ గావించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని సచివాలయ కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నామని, సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ
సచివాలయాలకు వచ్చే ప్రజలతో ఆత్మీయతగా మాట్లాడి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, సమస్యలను ఎప్పుడూ పెండింగ్ ఉంచరాదని కార్యాలయ సిబ్బంది కార్యాలయం వదిలి బయటికి వెళ్ళేటప్పుడు మూమెంట్ రిజిస్టర్ నందు కచ్చితంగా ఎంట్రీ చేయాలన్నారు. ఆరోగ్య మిత్ర గురించి జగనన్న చేదోడు, వైఎస్సార్ రైతు భరోసా, జీరో అకౌంట్ ల గురించి ప్రజలకు క్షుణ్ణంగా తెలియ చేయవలసిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు.
Post A Comment:
0 comments: