అంగరంగ వైభవంగా...

కానాల గ్రామంలో ఇళ్ళ పట్టాల పంపిణీ

పాల్గొన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల మండలంలోని కానాల గ్రామంలో దాదాపు 314 మంది అర్హులైన పేద వారికి జగనన్న సొంత ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కానాల గ్రామంలో అర్హులైన 314 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలి తప్ప మిగతా సమయంలో పార్టీలను పక్కన పెట్టి  అభివృద్ధి దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు.
అన్ని పార్టీలకు అన్ని కులమతాలకు సమానంగా ప్రభుత్వ పథకాలు అందివ్వడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల లాగా మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం మా ప్రభుత్వం చేయదని,  ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గతంలో సంవవత్సరం ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ గ్రామాలలో పట్టణంలో శిలాఫలకాలు వేసి వదిలేయడం జరిగిందని, కానీ మన ప్రభుత్వంలో చెప్పిన ప్రతి పని ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడమే జగనన్న ముఖ్య లక్ష్యమన్నారు.  గ్రామంలో ఇంకా ఎవరైనా అర్హులై ఉంటే 90 రోజులలో అప్లై చేసుకుంటే వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని,  అలాగే భవిష్యత్తులో ఇల్లు కట్టుకోడానికి కూడా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందన్నారు. ఎక్కడ వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ధ్యేయమని,  అలాగే ఈ రోజు కానాల, బాబానగర్ హైస్కూల్ కొట్టాల గ్రామానికి సంబంధించి 40 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం ని నిర్మించడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు విజయశేఖర్ రెడ్డి, తహసీల్దార్ రవికుమార్, ఎంపిడిఓ భాస్కర్, అధికారులు, వైకాపా నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు  పాల్గొన్నారు.



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: