ఇబ్బడి ముబ్బడిగా అపులు...? తీర్చేదారేది...?

సర్కారు అప్పులు ఎలా తీరునో !

పరిమితికి మించి చేబదుళ్లు 

బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పుల్లోనూ మూడో స్థానం 

అత్యధికంగా అప్పులు తీసుకున్న రెండు తెలుగు రాష్ట్రాలు 

మొదటి స్థానంలో ఏపీ 

చేబదుళ్లలో తెలంగాణది ఆరో స్థానం 

ఆర్‌బీఐ నెలవారీ నివేదికలో వెల్లడి 

రాష్ట్రంలో గతేడాది జూలైతో పోలిస్తే రూ.35.35 కోట్లు పెరిగిన జీఎస్‌టీ


దేశంలో చేబదుళ్ల రూపంలో అత్యధికంగా అప్పులు తీసుకున్న మొదటి ఆరు రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. ఆర్‌బీఐ  విడుదల చేసిన డిసెంబరు నెలవారీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, నాగాలాండ్‌, తెలంగాణ రాష్ట్రాల వేస్‌ అండ్‌ మీన్స్‌ వినియోగం పెరిగింది. తమ పరిమితికి మించి చేబదుళ్ల రూపంలో రుణాలు తీసుకున్నాయి. మరోపక్క మణిపుర్‌, పంజాబ్‌, పశ్చిమ్‌బెంగాల్‌ రాష్ట్రాలు చేబదుళ్లు తగ్గించుకున్నాయి. ఈ నివేదిక ప్రకారం  2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బహిరంగ మార్కెట్‌ రుణాలు భారీగా పెరిగాయి. కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో ప్రభుత్వాలు అప్పులపై ఆధారపడ్డాయి. 2019-20తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉత్తర్‌ప్రదేశ్‌ తప్ప అన్ని రాష్ట్రాల రుణభారం హెచ్చింది.  ఆర్‌బీఐ నుంచి రుణాలు పొందే అన్నిరకాల మార్గాలను రాష్ట్రాలు వినియోగించుకున్నాయి.


ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 13 రాష్ట్రాలు చేబదుళ్లు, మరో ఆరు రాష్ట్రాలు ఓవర్‌ డ్రాఫ్ట్‌నకు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్‌ అక్టోబర్‌లో 31 రోజులూ స్పెషల్‌ డ్రాయింగ్‌, చేబదుళ్లు; 17 రోజులు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వాడుకొంది. 2020 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.37,250 కోట్ల రుణం సేకరించి మూడో స్థానంలో నిలిచింది. మొదటి ఐదు స్థానాల్లో మహారాష్ట్ర (రూ.59,500 కోట్లు), తమిళనాడు (రూ.54,000 కోట్లు), ఏపీ (రూ.37,250 కోట్లు), కర్ణాటక (రూ.37,000 కోట్లు), తెలంగాణ (రూ.25,961 కోట్లు) ఉన్నాయి. ఏపీ గతేడాది 12 నెలల్లో తీసుకున్న రుణంలో 87.88% మొత్తాన్ని ఈసారి తొలి ఏడు నెలల్లోనే తీసుకొంది. ఇప్పటిదాకా ప్రతినెలా సగటున రూ.5,321.42 కోట్ల అప్పు చేసింది. ఇదే పంథా కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మొత్తం రుణం రూ.63,857.14 కోట్లకు చేరనుంది. 2018-19తో పోలిస్తే 2019-20లో రాష్ట్ర రుణం 40.44% పెరిగింది. ఇదే సరళి కొనసాగితే ఈ ఏడాది 50.55% మేరకు పెరగనుంది.

అప్పుల్లో ఐదులో రాష్ట్రం :

బహిరంగ మార్కెట్‌ నుంచి అధిక రుణాలు సేకరించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. గత ఏడు మాసాల్లో నెలకు సగటున రూ.3,708.71 కోట్ల చొప్పున రూ.25,961 కోట్ల అప్పు సేకరించింది. ఇదే ధోరణి కొనసాగితే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ఏడాది అప్పు రూ.44,504 కోట్లకు చేరనుంది. గత ఏడాది చేసిన మొత్తం అప్పులో 70% మొత్తాన్ని ఈ ఏడు నెలల్లోనే తీసుకొంది.  2018-19తో పోలిస్తే 2019-20లో బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించిన రుణం 38.77% పెరిగింది. ఇప్పటివరకు ఉన్న రుణ సరళిని బట్టి ఈ ఏడాది 19.92% వృద్ధి కన్పిస్తోంది. ఇక ఆర్‌బీఐ నుంచి రుణాలు పొందడంలోనూ అక్టోబర్‌ నెలలో అన్ని మార్గాలనూ తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంది. ఆ నెలలో 31 రోజులు స్పెషల్‌ డ్రాయింగ్‌, 29 రోజులు వేస్‌ అండ్‌ మీన్స్‌, 14 రోజులు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకొంది. 2020 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.37,250 కోట్ల రుణం సేకరించి మూడో స్థానంలో నిలిచింది.

జీఎస్‌టీ ఆదాయంలో వృద్ధి :

దేశవ్యాప్తంగా జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం క్షీణించినా రాష్ట్రంలో మాత్రం వృద్ధి నమోదైంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలైలో జీఎస్‌టీ ఆదాయం గతేడాది కంటే రూ.35.35 కోట్లు పెరిగి రూ.1,998.12 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలానికి జీఎస్‌టీ ఆదాయం రూ.1,962.77 కోట్లుగా ఉంది.  దేశవ్యాప్తంగా చూస్తే జూలైలో జీఎస్‌టీ ఆదాయం 14.36 శాతం క్షీణించి రూ.1,02,082 కోట్ల నుంచి రూ.87,422 కోట్లకు పడిపోయింది.  రాష్ట్రంలో ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆహార పదార్థాల వినియోగం పెరగడంతో జీఎస్‌టీ ఆదాయం పెరిగింది. లాక్‌డౌన్‌ సమయంలో 75 శాతం ఆదాయం కోల్పోయినా ఇప్పుడు ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో ఆ నష్టం 25 శాతానికి తగ్గిందన్నారు.  ఈ నాలుగు నెలల కాలంలో రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయం రూ.5,508.49 కోట్లుగా ఉంటే గతేడాది ఇదే కాలానికి రూ.7,345.69 కోట్లుగా ఉంది.  రీస్టార్ట్‌ తర్వాత రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ అమ్మకాల్లో కూడా వృద్ధి నమోదవుతోంది.  జూలైలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.852.97 కోట్లు వస్తే గతేడాది ఇదే కాలానికి రూ.859 కోట్లుగా ఉంది.  కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ రూపంలో రూ.2,713 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయానికి ఈ ఆదాయం రూ.3,521 కోట్లుగా ఉంది.

దుమ్ముదులిపిన జీఎస్టీ వసూళ్లు : 

రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు..కోవిడ్‌ ప్రబలడానికి ముందునాటి పరిస్థితులకు చేరుకున్నాయి. జీఎస్టీ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్‌ నెలలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.2,480 కోట్లకు చేరాయి. ప్రస్తుత సంవత్సరంలో ఈ స్థాయిలో పన్నులు వసూలు కావడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1,975 కోట్లు. అదేనెలలో ఈ ఏడాది 26 శాతం వృద్ధితో రూ.2,480 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వృద్ధిరేటు అధికంగా ఉండటమే దీనికి నిదర్శనమంటున్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో 5 శాతం వంతున, తమిళనాడులో 13, ఒడిశాలో 21 శాతం వృద్ధి నమోదైంది. పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించడం వల్ల అక్టోబర్‌లో రూ.350 కోట్ల మేర అదనంగా వసూలైంది.ఈ ఏడాది తొలిసారిగా కనీస రక్షిత :

ఆదాయానికి మించి: 2020–21 సంవత్సరానికి కనీస రక్షిత ఆదాయం నెలకు రూ.2,225 కోట్లుగా నిర్ణయించారు. ఇంతకంటే తగ్గిన ఆదాయం మొత్తాన్ని కేంద్రం పరిహారం రూపంలో చెల్లిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా అక్టోబర్‌లో కనీస రక్షిత ఆదాయం మించి పన్ను వసూలైంది. ఏప్రిల్‌– సెపె్టంబర్‌ కాలానికి కనీస రక్షిత ఆదాయం కింద రూ.13,350 కోట్లు రావాల్సి ఉండగా రూ.8,850.62 కోట్లు మాత్రమే వసూలైంది. ఆరునెలల్లో రూ.4,499.38 కోట్ల మేర తక్కువ వసూలైంది. ఈ ఆరునెలల్లో సగటున నెలకు రూ.1,475.10 మాత్రమే జీఎస్టీ వసూలైంది.

దేశంలో తొలిసారి లక్షకోట్లు : 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల మార్కును అధిగమించాయి. అక్టోబర్‌ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,05,155 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థికశాఖ ప్రకటించింది. గతేడాది అక్టోబర్‌ నెలలో వసూలైంది రూ.95,379 కోట్లు. వరుసగా రెండునెలల నుంచి జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండటం ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుందన్న సంకేతాలిస్తోంది.

 

పెట్రోల్‌ అమ్మకాల్లో 20 శాతం వృద్ధి :

రాష్ట్రంలో పెట్రోల్‌ అమ్మకాల్లో భారీ వృద్ధి రేటు నమోదవుతుండగా, డీజిల్‌ అమ్మకాలు కోవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండు నెలల నుంచి పెట్రోల్, డీజిల్‌ ఆదాయంలో నమోదవుతున్న వృద్ధి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెట్రో వ్యాట్‌ ఆదాయంలో 6.39 శాతం వృద్ధి నమోదు కాగా అక్టోబర్‌కల్లా 25.24 శాతానికి పెరిగింది. గతేడాది సెప్టెంబర్‌ నెలలో రూ.851.40 కోట్లుగా ఉన్న పెట్రో వ్యాట్‌ ఆదాయం ఈ ఏడాది 6.39 శాతం వృద్ధితో రూ.905.78 కోట్లకు చేరింది. అలాగే అక్టోబర్‌లో 25.24 శాతం వృద్ధితో రూ.750.35 కోట్ల నుంచి రూ.939.76 కోట్లకు చేరింది. లాక్‌డౌన్‌తో తొలి త్రైమాసికంలో 30 శాతం ఆదాయం నష్టపోగా రెండవ త్రైమాసికంలో కొద్దిగా కోలుకొని 3.76 శాతం వృద్ధి నమోదయ్యింది.

ఏడు నెలల్లో రూ.5,448.79 కోట్ల ఆదాయం :

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.5,448.79 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఏప్రిల్‌–అక్టోబర్‌ కాలంలో ఈ ఆదాయం రూ.5,965.50 కోట్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికంలో రూ.1,860.09 కోట్లుగా ఉన్న ఆదాయం ద్వితీయ త్రైమాసికానికి రూ.2,648.98 కోట్లకు చేరింది.

✍️ రచయిత-ఇస్కా రాజేష్ బాబు 

సీనియర్ జర్నలిస్ట్

సెల్ నెం- 96520 39780

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: