అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి       

సిపిఐ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్  పరిధిలోని పాణ్యం మండలం లోని సబ్ రిజిస్టర్ కార్యాలయం లో జరుగుతున్న అవినీతి అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ నంద్యాల లో ఉన్న జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో జిల్లా రిజిస్టర్ పి. ఉషారాణికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు. ఎస్. బాబా ఫక్రుద్దీన్. సిపిఐ పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్. ఏ ఐ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు.డి.  శ్రీనివాసులు సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి. ఎస్. షరీఫ్  భాష. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఏ. సుబ్బరాయుడు..ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి. ధనుంజయుడు. పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ పాణ్యం మండలంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గతంలో పనిచేసిన రిజిస్టర్ అధికారులు అవినీతి వల్ల బలపనూరు గ్రామంలోని కుమ్మరి. జయకుమార్ కు చెందిన సర్వే నెంబరు 254 నెంబర్ లోని 2. 5. ఎకరాల పొలము ను  నంద్యాలకు చెందిన అబ్దుల్ నబీ ఒక ఎకరా పొలం అమ్మడం జరిగింది. తిరిగి మరో రెండు నెలల తర్వాత అదే సర్వేనెంబర్ లో ఉన్న చెందిన రెండున్నర ఎకరాల పొలం తప్పుడు రికార్డులతో సృష్టించిన కుమ్మరి. జయ కుమార్. నంద్యాలకు చెందిన ద్వారం చంద్రశేఖర్రెడ్డి అమ్మడం జరిగింది. కుమ్మరి జయకుమార్ కు చెందిన రెండున్నర ఎకరా పొలమును ఒకే సర్వే నెంబర్లో ని పొలంలో ఒక ఎకరా అమ్మగా మిగిలిన ఒకటిన్నర ఎకరా పొలం మిగలగా కానీ సబ్ రిజిస్టార్ అవినీతివల్ల రెండున్నర ఎకరాల రిజిస్టర్ చేయడం ఎంతవరకు సబబు అని ఆరోపించారు. గతంలో పనిచేసిన అవినీతి అధికారుల వల్ల ఇలాంటి అనేక ఘటనలు పాణ్యం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జరిగాయని వీటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ప్రమాదం కాకుండా చూసేందుకు జిల్లా  రిజిస్టర్. శ్రీమతి ఉషా రాణి గారు చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: