నంద్యాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తాం

 ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలోని 9 వార్డు నందు మాజీ కౌన్సిలర్ పడకండ్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నూతన కమ్యూనిటీ హల్ ను 10 లక్షల రూపాయలతో MLA శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ
నంద్యాల పట్టణంలోని గుడిపాటిగడ్డ నందు చెత్తా చెదారంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడటము  తెలుసుకొని 10 లక్షల రూపాయలతో కమిటీహాల్ ను నిర్మించడం జరిగిందని, ఎంతో కాలంగా ప్రజల కోరికను ఈరోజు నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అలాగే వార్డులోని ప్రజలందరూ ఫంక్షన్ లు కానీ మీటింగ్లు కానీ వాడుకోవడానికి వీలుగా నిర్మించడం జరిగిందన్నారు. అలాగే నంద్యాల పట్టణంలో.మరిన్ని కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పడగండ్ల సుబ్రహ్మణ్యం, దండే బుజ్జయ్య,  దండి సుధాకర్, దండె  శ్రీను, సంచిపట్టల కరీం, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇసాక్ భాష, మాజీ కౌన్సిలర్ కత్తి శంకర్, మాజీ కౌన్సిలర్ బీమిని పల్లె వెంకట సబ్భయ్య, పురందర్, మాజీ కౌన్సీలర్ సుబ్బారాయుడు, మాజీ కౌన్సలర్ కలాం, షాధిక్, తబ్రెస్,  బాచం జగదీశ్వర రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, వైసిపి నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: