అసువులు బాసిన రైతులకు నివాళులు
ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు నవీన్ కుమార్
(జానోజాగో వెబ్ న్యూస్-నంది కొట్కూరు ప్రతినిధి)
రైతాంగానికి ఉరితాళ్ళు బిగించే మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని సరిహద్దులో సుమారు 25 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు స్థానిక నందికొట్కూరు పట్టణంలోని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) ఆధ్వర్యంలో సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా నాయకులు నవీన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ప్రైవేటికరణ చేసేందుకు పార్లమెంటులో మూడు నల్ల చట్టాలను ప్రవేశపెట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా ఆమోదించారని ఆవేదన వ్యక్తం చేశారు.కార్పొరేటికరణకు లాభం చేకూర్చే మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని ,దేశంలోని రైతాంగాన్ని కాపాడాలని అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ(ఏఐకెఎస్ సీసీ) ఆధ్వర్యంలో దేశంలోని రైతు సంఘాలు అన్ని సుమారు 25 రోజులుగా ఎముకలు కొరికే చలిలో కూడా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేసారు.కేంద్ర ప్రభుత్వం దౌర్జనానికి చాలా మంది రైతులు ఆందోళనలో పోలీసుల లాఠీ దెబ్బలకు మూర్ఛపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు నేడు దేశ వ్యాప్తంగా సంతాప దినాన్ని ప్రకటించారని తెలియజేసారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులతో చర్చలు జరిపి మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో చనిపోయిన రైతులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల ప్రాణనష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు రాజేష్, వీరేంద్ర, పీడీఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ.రఫీ,జిల్లా ఉపాధ్యక్షుడు కె.నాగరాజు,నాయకులు కార్తిక్,శంకరాచారి,హరిక్రిష్ణ, ఫయాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: