పేద ప్రజల అభ్యున్నితికి శిల్పా కుటుంబం పాటుపడుతుంది

ప్రజలకు నూతన సంవత్సర కానుక మార్కెట్ పునఃప్రారంభం

కోటితో మార్కెట్ అభివృద్ధి 

ప్రతిపక్షాలు విమర్శలు మానుకోండి.. ఆరోపణలకు చెక్

శిల్పా కుటుంబాన్ని వేరుచేయటానికి దృష్ప్రచారం

ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 పేద ప్రజల అభ్యున్నితికి శిల్పా కుటుంబం పాటుపడుతుందని, ప్రజలకు నూతన సంవత్సర కానుకగా కూరగాయల మార్కెట్ పునఃప్రారంభం ప్రతి పక్ష నాయకుల ఆరోపణలకు చెక్ పడిందని  ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి అన్నారు. గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ పునఃప్రారంభానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మార్కెట్ చేరుకోవడంతో వ్యాపారులు ఘన స్వాగతం పలికారు.
చీకటిలో ఉన్న వ్యాపారులకు వెలుగు నివ్వడంతో తమ ఆనందాన్ని టపాసులు భారీగా కాల్చి పూల పాన్పుతో తమ నాయకుని స్వాగతం పలికారు. మార్కెట్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ కలాం, ఉపాదక్షులు మహబూబ్ బాష, కార్యదర్శి మహబూబ్ జైలని సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మార్కెట్ ను హర్షద్వానాల మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల ప్రజల అభ్యున్నతికి శిల్పా కుటుంబం పాటుపడుతుందన్నారు. మార్కెట్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. వారి ఆరోపణలకు మార్కెట్ పునఃప్రారంభం చెక్ పడిందన్నారు. రిలయన్స్ అంబానికి మార్కెట్ విక్రయించారని దృష్ప్రచారం చేసి ప్రజలనుంచి శిల్పా కుటుంబాన్ని వేరుచేయదానికి చేసిన కుతంత్రాలు భగ్నమయ్యాయన్నారు.
మా కుటుంబంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కోటి రూపాయలతో ప్రస్తుతం అభివృద్ధి చేశామని, మార్కెట్ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ఖర్చుచేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రథమంగా నంద్యాల మార్కెట్ అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చుచేసిన ఘనత మనకే దక్కిందన్నారు. కరోనాతో 9 నెలలు మార్కెట్ వ్యాపారస్తులు దూరంగా ఉండి వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డారన్నారు. కరోనా వ్యాప్తిచెందకుండా కూరగాయల వ్యాపారాన్ని మొదట డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం వర్షాలకు నష్టపోవడంతో నూనెపల్లి మార్కెట్ యార్డుకు మార్చామన్నారు. అన్ని విధాలుగా సహకరించిన మార్కెట్  వ్యాపురుల అభ్యన్నుతికి కోట్లాది రూపాయలతో మార్కెట్ అభివృద్ధి చేసామన్నారు. కరోనా విపత్తులో దూరదృష్టంగా మార్కెట్ వ్యాపారులు ముగ్గురు, కిరాణా వ్యాపారులు 27 మంది మృతిచెందడం బాధాకరమన్నారు.
మార్కెట్ విక్రయించడం ఎవరి సొత్తుకాదు, నంద్యాల ప్రజలు ముఖేష్ అంబానికోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా మార్కెట్ వ్యాపారులు చేసిన సేవలు మరవరానిదన్నారు. మార్కెట్లో గతంలో నా తండ్రి మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి పండ్ల వ్యాపారాల సమస్య పరిష్కరించారన్నారు. మార్కెట్లో గతంలో ఉన్నవారందరికి దుకాణాలు వస్తాయని, అపోహలు వద్దన్నారు. వ్యాపారాలకు ప్రధానంగా పార్కింగ్ వసతి లేకపోతే వ్యాపారాలు జరగవనే ఉద్దేశ్యంతో పార్కింగ్ ఏర్పాటు చేయడం వల్ల కొద్దిగా ఆలస్యం అయిందన్నారు. వ్యాపారాలను రోడ్డుపాలు చేయమన్నారు. నంద్యాలపై త్వరలో చేపల మార్కెట్ వస్తుందన్నారు. చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఒకొక్కరికి 10 వేలు వడ్డీలేకుండా రుణాలు ప్రకటించారని నంద్యాలలో 3500 మందికి లబ్ది చేకూరిందన్నారు. ఓట్లకు జిమ్మిక్కులు చేసే  నాయకుల మాటలు నమ్మొద్దన్నారు. అనంతరం ఎమ్మెల్యే, అధికారులను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ వెంకట కృష్ణ, తహశీల్ధార్ రవి కుమార్, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ ఇషాక్, మాజీ మున్సిపల్ ఛైర్మెన్ దేశం సులోచన, సుధాకర్ రెడ్డి, గంగిశెట్టి శ్రీధర్, మార్కెట్ ప్రసాద్, సమద్, తిరువీది వెంకటసుబ్బయ్య, మాజీ కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: