పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి
జానోజాగో నేత షేక్ మౌలాలి డిమాండ్
షేక్ మౌలాలి
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని జా నో- జాగో( ముస్లింల అభివృద్ధి వేదిక) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్. మౌలాలి డిమాండ్ చేశారు 15 రోజుల్లో రెండుసార్లు అంటే డిసెంబర్ 2 తేదీన50/- రూపాయలు, మరలా ఇదే నెలలో15 వ తేదీన50/- రూపాయలు చొప్పున ఒకే నెలలో వంద రూపాయలు పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించు కోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం మొన్నటి వరకు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం వలన, రవాణా రంగంపై భారం పడి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనలేక, తప్పని పరిస్థితులలో అప్పులు చేసి కోనే పరిస్థితులు వచ్చాయని వాపోతున్నారు. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి అసలే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న ప్రజల పై కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజల జేబులు కొట్టి కార్పొరేట్ సంస్థ అధినేత లైనా అంబానీ, అదానీ జేబులు నింపుతూ కొమ్ము కాయడం విచారకరమని తెలిపారు. దయచేసి ఈ విపత్తు కాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Post A Comment:
0 comments: