సమస్యలను పట్టించుకోని వార్డెన్లు

వారిపై చర్యలు తీసుకోవాలి

ఏఐఎస్ఎఫ్ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

 హాస్టల్ విద్యార్థుల సమస్యలు పట్టించుకోని వార్డెన్లు పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నంద్యాల డివిజన్ ప్రధాన కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. నంద్యాల లో సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్సీ ఎస్టీ బిసి హాస్టల్ వార్డెన్ ల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాల ఆర్డిఓ కార్యాలయం లో  హరినాథ్ రావుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు సురేష్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో 9,10 తరగతి మరియు ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ విద్యార్థులకు తరగతులు జరుగుతున్న సందర్భంలో హాస్టల్ లోశానిటేషన్ లేకుండా, సక్రమంగా బాత్రూంలు శుభ్రం చేయక,వాటర్ సదుపాయాలు లేకుండా, విద్యార్థులకు సమయానికి భోజనాలు ఏర్పాటు చేయక విద్యార్థుల గోడు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న హాస్టల్ వార్డెన్ ల పై చర్యలు తీసుకోవాలని వారు జిల్లా సంక్షేమ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. *కావున తక్షణమే జిల్లా సాంఘిక సంక్షేమ హాస్టల్ లో నెలకొన్న సమస్యలపై ఎస్సీ, ఎస్టీ, బిసి డీడీ తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో  ఏఐఎస్ఎఫ్ గా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతమని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు బాలాజీ మధు శ్రీకాంత్ పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: