ఏ.కె.ఖాన్ ను సత్కరించిన నిమ్మరాజు చలపతిరావు
ఇరువురి మధ్య ఆత్మీయ భేటీ
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
విజయవాడలో ఓ కార్యక్రమం నిమిత్తం వచ్చిన తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ గౌరవ సలహాదారు, మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కె.ఖాన్ ను విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు కలిశారు. మీడియా మిత్రులతో సన్నిహితంగా మెలిగే ఏ.కె.ఖాన్(ఐపీఎస్) విజయవాడ వచ్చిన సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏ.కె.ఖాన్ ను సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు సత్కరించారు.
ఈ సందర్భంగా ఏ.కె.ఖాన్ మాట్లాడుతూ శుక్రవారం, క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి ఒకే రోజు రావడం శుభపరిణామం అన్నారు. ఇలాంటి సందర్భం మన దేశలోని అన్ని వర్గాల ప్రజల మధ్య సౌభ్రాతుత్వం పెంపొందిస్తున్నారు. ఈ శుభ రోజుల సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇాదిలావుంటే నగరానికి విచ్చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కె.ఖాన్ కు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలసి అహ్వానం పలికారు.
Post A Comment:
0 comments: