ఆ భూములను లాక్కోవడం సిగ్గుచేటు
ఐయూఎంఎల్
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
ఆర్ ఏ ఆర్ ఎస్ భూములు రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమించుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నూట పద్నాలుగు సంవత్సరాల ముందర నుంచి రైతులకు ఉపయోగపడే భూముల రాష్ట్ర ప్రభుత్వం ఆ భూముల్లో కాలేజ్ పెడతాం అని చెప్పడం బాధాకరమైన విషయమన్నారు. బుధవారంనాడు ఆర్ఏఆర్ఎస్ భూముల కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన నిరసనకు ఐయూఎంఎల్ మద్దతు తెలిపింది. ఉన్న ప్రభుత్వ ఆసుపత్రియే సరిగ్గా వైద్యం అందించడం లేదు, గవర్నమెంట్ ఆసుపత్రి లో సరిగ్గా వైద్యం అందిస్తే తర్వాత ఆస్పత్రులు ఎందుకు వస్తాయని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశ్నించారు సలాం మూలానా, కర్నూలు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ మౌలానా రఫీ ఉద్దీన్ పేర్కొన్నారు.
ఎంత మంది కార్మికులు ఆర్ ఏ ఆర్ ఎస్ భూముల పైన దీక్ష చేస్తుంటే ర్యాలీలు తీస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మౌనం పాటించడం చాలా సిగ్గుచేటు అని చెప్పారు. రైతులకు ఉపయోగపడే భూములను రైతులకు అంకితం చేయాలని చెప్పారు ఆర్ ఏ ఆర్ ఎస్ భూముల పైన నిరసన చేస్తున్న ధర్నాలు చేస్తున్న నంద్యాల తాలూకా ఆఫీస్ ముందర మద్దతు గా ఐయుఎంఎల్ వెళ్లింది. ఈ సందర్భంగా వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా సెక్రెటరీ ఎం ఎం డి ఓ మే ర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: