బిల్డర్ పొలిశెట్టి సత్యనారాయణపై జరిగిన దాడిపై ధర్నా 

టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముట్టడి

దాడిలో గాయపడ్డ పొలిశెట్టి సత్యనారాయణ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

బిల్డర్ పొలిశెట్టి సత్యనారాయణపై శనివారం జరిగిన దాడిపై ఆదివారం పెద్ద సంఖ్యలో ఆర్య వైశ్య సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు.ఆర్యవైశ్యులు ఏకమై భారీ ర్యాలీ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు మూసివేసి ధర్నాలు చేపడతామన్నారు. అంతకు ముందు భరతమాత దేవాలయంలో ఆర్యవైశ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆవేశంగా మాట్లాడుతూ

స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న ఆర్యవైశ్యులు 

 ఆర్యవైశ్యులపై దాడులు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. వ్యాపారాలు చేసుకునే మేము అందరిని గౌరవిస్తామని, అగౌరవిస్తే మా తడాకా చూపిస్తామన్నారు. ఆర్యవైశ్యులలో ఐక్యమత్యం లేకపోవడంతో రౌడీలు, గూండాలు రెచ్చిపోతున్నారని, ఎదురుదాడి చేయకపోతే మనుగడ సాగించలేమని ఆర్యవైశ్యులలో ధైర్యం నింపారు. పొలిశెట్టి సత్యనారాయణపై దాడిచేసిన వారితో పాటు వెనకవుండి నడిపించిన వారిపై  హత్య కేసు నమోదుచేసి మిస్టర్ ఇడ్లి దుకాణం ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ భారత మాత దేవాలయం నుంచి భారీ ర్యాలీలో పోలీస్ స్టేషన్ చేరుకున్నారు.

దుకాణంకు సంబందించిన కరెంట్ బిల్లు కట్టమని అడిగినందుకు దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు. రెండు పోలీస్ స్టేషన్ల ఎదుట జరిగిన సంఘటన పోలీస్ శాఖ ఛాలెంజ్ గా తీసుకోవాలన్నారు. అనంతరం అక్కడి నుంచి భారీగా ర్యాలీగా స్టేషన్ చేరుకున్నారు. బిల్డర్ సత్యనారాయణకు న్యాయం జరగకపోతే రాష్ట్రాన్ని అట్టుడికిస్తామని అన్నారు. అనంతరం సిఐ కంబగిరి రాముడు మాట్లాడుతూ బాధితులకు న్యాయంచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సంఘటనను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, వామ పక్ష నాయకులు బాబా పక్రుద్దీన్, ప్రసాద్, శ్రీనివాసులు, షరీఫ్ బాష, సుబ్బారాయుడు, చెన్నయ్యలు  తీవ్రంగా ఖండించారు.

మాట్లాడుతున్న సోమిశెట్టి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: