చిలువేరు ఇంట కళ్యాణం.. కమనీయం 

కన్నుల పండువగా చిలువేరు సాయిరెడ్డి కుమార్తె రచన రెడ్డి వివాహం

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

హైదరాబాద్ కు చెందిన  చిలువేరు సాయిరెడ్డి  ఉదయశ్రీ దంపతుల ఏకైక పుత్రిక చి.ల.సౌ. రచన రెడ్డి  వివాహా వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది.  చిలువేరు సుధాకర్ రెడ్డి- శ్రీమతి చిలువేరు లక్ష్మి ఆశీస్సులతో స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శార్వరి నామ సంవత్సర కార్తీక బ. ఏకాదశిశుక్రవారం 11.12.2020 ఉదయం 8 గంటల 28  స్వాతి నక్షత్రయుక్త ధనుర్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున చిలువేరు సాయిరెడ్డి -ఉదయశ్రీ దంపతుల ఏకైక పుత్రిక చి.ల.సౌ. రచన రెడ్డి వివాహము  ఇమ్మడి మాధవి-రాంచంద్రారెడ్డి ప్రధమ పుత్రుడు చి. శ్రీధర్ రెడ్డితో జరిగిన ఈ వివాహ మహోత్సవానికి నంది అవార్డు గ్రహీత, దక్కన్ క్రానికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్ట్ ఎం. డి అబ్దుల్ , దర్శకుడు  స్వామి, సినీ నిర్మాత ఈశ్వర్ , మిట్టపల్లి మహేందర్, కరుణాకర్ రెడ్డి తదితరులు  హాజరై  కల్యాణ మహోత్సవాన్ని తిలకించి నూతన దంపతులను ఆశీర్వదించారు.

రచనరెడ్డి వివాహ వేడుకలో చిలువేరు సాయిరెడ్డి, నరసింహా రెడ్డిలతో నంది అవార్డు గ్రహీత ఎం.డి అబ్దుల్

వివాహ వేడుకలో మోహన్ రెడ్డితో అబ్దుల్
 
ఈ వివాహ వేడుక ఘట్కేసర్ సమీపంలోని ఔషాపూర్  రాక్ ఎన్ క్లయివ్ కన్వెన్షన్ లో  కన్నుల పండువగా జరిగింది. దైవజ్ఞులైన  భాగవోత్తములచే నిశ్చయించబడిన ఈ వివాహ మహోత్సవానికి బంధు మిత్రులు సపరివార సమేతంగా విచ్చేసి కల్యాణ మహోత్సవమును తిలకించి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ మహోత్సవం  చిలువేరు నర్సింహా రెడ్డి , గొన్న నరేందర్ రెడ్డి,  వంచ నరసింహా రెడ్డి, వంచ కృష్ణారెడ్డి మరియు బంధుమిత్రుల అభినందనలతో  అంగరంగ వైభవంగా  కళ్యాణం.. కమనీయంగా జరిగింది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: