దేశ చరిత్రలో నిలచిపోనున్న....

వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల కార్యక్రమం

30 లక్షల మందికి పైగా స్థలాలు పంపిణి

మరో 2,62 లక్షల టిడ్కో ఇల్లు.

పేదలకు సొంత ఇంటి కళను నెరవేర్చిన వైఎస్ జగన్

వైసీపీ రాష్ట్ర నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి వెల్లడి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇళ్ళు లేనివారిని గుర్తించి 30 లక్షల మంది కి పైగా అక్కా,చెల్లెమ్మలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుండి వచ్చే నెల 10 వ తేది వరకు జరుగనున్న వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయముగా మిగిలిపోతుండడం హర్షణీయమని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా జరుగు నివాస పట్టాల కార్యక్రమాన్ని  పార్టీలకు,వర్గాలకు అతీతంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ 23,535 కోట్ల మార్కెట్ విలువ గల 68,361 ఎకరాల భూమిలో 30,75,755 మంది ఆడపడుచులకు ఉచితంగా నివాస యోగ్యం కల్పించడం శుభ సూచికమని అన్నారు. రాష్ట్రంలో పేదలందరికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో  రూ 50,940 కోట్ల వ్యయంతో రెండు దశల్లో నిర్మించాలని, అందులో భాగంగా మొదటి విడతగా రూ 28,080 కోట్ల వ్యయంతో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి నేడు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఏర్పాటు కానున్న 17,005   వైఎస్సార్ జగనన్న కాలనీలలో కేవలం నివాస యోగ్యం కల్పించడమే గాకుండా రూ 6,800 కోట్ల వ్యయంతో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి కల్పిస్తుండడం హర్షణీయమని అన్నారు. ఇంటి స్థలాలకు సంబంధించి    ఎప్పటి నుండో కంటున్న కలలు ముఖ్యమంత్రి జగన్ చల్లని దీవెనలతో నిజం కావడంతో మహిళల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయని డాక్టర్ ఏలూరి అన్నారు. వాస్తవానికి నివాస పట్టాల పంపిణీ కార్యక్రమం ఎప్పుడో పూర్తి అయ్యేదని, అయితే పంపిణీ అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రజల్లో  పేరు ప్రఖ్యాతులు వస్తాయనే దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తూ కుట్రతో ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసిందని,అందువల్లనే రెండు,మూడు సార్లు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిందని,కావున దీనికి టీడీపీనే బాధ్యత వహించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన టిడిపికి ఇక మనుగడ లేదని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: