పూజారుల పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

ఇన్సాఫ్ కమిటీ డివిజన్ నాయకులు ఎస్.షరీఫ్ బాషా డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి) 

 కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారం క్షేత్రం లో దారుణంగా  వ్యవహరించి ఆలయ  పూజారులను చితకబాదిన ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఇన్సాఫ్ కమిటీ డివిజన్ నాయకులు ఎస్. షరీఫ్ బాషా డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా షరీఫ్ భాష మాట్లాడుతూ పూజారులను చర్నాకోల తో కొట్టడం చాలా దారుణంమనం  ఆటవిక వ్యవస్థలో ఉన్నామా లేక ప్రజాస్వామ్యంలో ఉన్నామా  పూజారి మృగపాణి  శర్మను మరో ఇద్దరు పూజారులను  దాడి చేసి గాయపరిచిన ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి విధుల నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలి సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి దేవాలయాల్లో స్వాములకు రక్షణ లేకపోతే వారు భక్తులకు సేవలు ఎలా చేయగలుగుతారు వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: