రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయండి

నాగేశ్వరావు పిలుపు

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)

ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా ఈ నెల 25 నుండి నందికొట్కూరులో రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని అఖిలభారత రైతు సంఘాల కోఆర్డినేషన్ కమిటీ నాయకులు నాగేశ్వరావు పిలుపునిచ్చారు గురువారం నందికొట్కూరు వామపక్ష ప్రజా సంఘాల సమావేశం పి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో నాయకులు రఘురాం మూర్తి  అరుణ్ కుమార్ పకీర్ సాహెబ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి భూముల నుండి రైతులను వెళ్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి ఎందుకు కుట్రలో భాగంగానే ఈ చట్టాలు తెచ్చారన్నారు స్వేచ్ఛా మార్కెట్ పేరుతో రైతులను దగా చేస్తున్నారన్నారు నిత్యావసర చట్టాన్ని సవరించడం వల్ల పెట్టుబడిదారులు ఆహారధాన్యాలు నిల్వచేసుకొని ధరలు పెంచుకునే అవకాశం ఉందని వారు ఆరోపించారు కరెంటు ప్రైవేటీకరణ చేయడం వల్ల రైతులకు ఉచిత కరెంటు దళితులకు ఉచిత కరెంటు అందే అవకాశాలు కోల్పోతారని వారు ఆరోపించారు ఢిల్లీ రైతులు ఆందోళన విరమించారు నందికొట్కూరు నియోజకవర్గంలో ఆందోళన తీవ్రతరం చేయాలని తీర్మానం చేసినట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సూరి బి బి పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: