అర్హత గల ప్రతి ఒక్కరికి ఓటరుగా చేర్చుతాం

రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. శేషి రెడ్డి

మార్కాపురం డివిజన్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. శేషిరెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం పట్టణం)

ప్రకాశం జిల్లా  మార్కాపురం నియోజకవర్గములో అర్హత గల ఏ ఒక్కరిని తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేయాలని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. శేషి రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని తర్లుపాడు,సీతానాగురల్లో ప్రత్యేక ఓటర్ల  నమోదు క్యాంప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఉన్న పోలింగ్ కేంద్రాల ను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.శేషి రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గములో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్లు గా నమోదు చేసుకొవాలన్నారు.

నియోజకవర్గములో 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లు గా నమోదు చేసుకోవాలన్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలకు ఓటు హక్కును కల్పించాలని ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి వచ్చిన దరఖాస్తులను వెంటనే విచారణ చేపట్టి పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో పోలింగ్ కేంద్రాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: