అధిష్టానం ఆదేశిస్తే నంద్యాల నుండి పోటీ చేస్తా

విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి 

మాట్లాడుతున్న ఏవీ సుబ్బారెడ్డి 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశించి సీటు ఇస్తే నంద్యాల నుండి పోటీ చేస్తానని విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో బిర్యానీ వాలా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏవీ సుబ్బారెడ్డికి బలమైన ఓటు బ్యాంక్ ఉందన్నారు. ఏవీ సుబ్బారెడ్డి , భూమా నాగిరెడ్డి వేరు కాదని చెప్పారు.
గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం గుర్తు చేశారు. భూమా నాగిరెడ్డి తర్వాత వారసత్వంగా భూమా బ్రహ్మానంద రెడ్డికి సీటు ఇచ్చారని చెప్పారు. అందరం తెలుగుదేశం పార్టీలో ఉన్నామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నంద్యాలలో ఉన్నదంతా ఏవీ వర్గమేనని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నంద్యాలో 100 శాతం ఏవీ వర్గమే అని తెలియజేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: