సంస్మరణ సభను విజయవంతం చేయండి

 తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

ఇటీవల ఆకస్మిక మృతి చెందిన ప్రజా పాత్రికేయులు, విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్ సంస్మరణ సభను డిసెంబర్ 2న (బుధవారం) నిర్వహించ నున్నట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 11 గం.లకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగే ఈ సభను జర్నలిస్టులు, మీడియా శ్రేయోభిలాషులు విజయవంతం చేసి ముత్యాల ప్రసాద్ కు నివాళ్ళర్పించాలని వారు కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: