ఒక రాష్ట్రం ఒక రాజధాని

ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలి

జానోజాగో సంఘం రౌండ్ టేబుల్ సమావేధశంలో రాజకీయ పార్టీలు...ప్రజా సంఘాల డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఏపీ రాజధాని అమరావతే అని ప్రజా సంఘాలు నినాదించాయి. గురువారంనాడు కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ఐయూఎంఎల్ పార్టీ కార్యాలయంలో.  జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా అధ్యక్షతన  జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఐయూఎంఎల్, సీపీఎం, కాంగ్రెస్, పీడీఎస్ యూ  జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ అమరావతి రాజధానిగాప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రధానిమోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి పై ద్వంద వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు.



 

వైసీపీ ప్రభుత్వానికి రైతులపై ప్రేమవుంటే మీ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు రోడ్డుపై వచ్చి రైతులకు మద్దతు తెలపాలి. ప్రత్యేక హోదా ప ఊసెత్తని నేతలు..అమరావతిపైముఖ్యమంత్రిమాటతప్పారు,మడమ తిప్పారు.365 రోజులుగా అమరావతి లో ధర్నాలు చేస్తున్న రైతుల సమస్యలను  ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదు. అమరావతి శంకుస్థాపనకు నీరు, మట్టి తెచ్చిన ప్రధాని ,నేడు ప్రజలకు నీరు ,మట్టి నెత్తిన పోశారు..ప్రజలను మభ్యపెట్టకుండా రాజధానిపై సారైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే  రైతులు ధర్నా చేపట్టి  సంవత్సరము  అవుతున్న రాష్ట్రప్రభుత్వంవారితోచర్చలుజరగకపోవడందారుణమని అన్నారు రైతులు నమ్మి భూమి ఇస్తే నట్టేట ముంచు తార అని నాయకులు ఈ సందర్భంగా ప్రశ్నించారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: