అంద విద్యార్థులకు చలికోట్లు పంపిణీ చేసిన... 

ఎంఐఎం పార్టీ నంద్యాల అధ్యక్షులు అక్బర్ హుస్సేన్


 

(  జానో జాగో  వెబ్ న్యూస్- కర్నూలు జిల్లా ప్రతినిధి)

    యువత పుట్టినరోజులు మధురానుభూతులు గుర్తుకు వచ్చేలా చేసుకోవాలని ఎంఐఎం పార్టీ నంద్యాల అధ్యక్షులు అక్బర్ హుస్సేన్ పేర్కొన్నారు. అక్బర్ హుస్సేన్ పుట్టినరోజు సందర్భంగా 50 మంది అందవిద్యార్ధులకు చలికోట్లు పంపిణీచేశారు. హంగు ఆర్భాటంలేకుండా విద్యార్థుల మధ్య, స్నేహితులతో కలిసి వారితో ముచ్చటించారు. విద్యార్థులతో సమాజంలో జరుగుతున్న వింతలు విశేషాలు తెలియజేసారు. యువత పుట్టినరోజు వేడుకలకు కేక్ కటింగ్, డిన్నర్లు మానుకొని ఇలాంటివారికి సహాయం చేయాలని సూచించారు. చలికాలం కావడంతో విద్యార్థులకు చలికోట్లు అవసరాన్ని గుర్తించి అందించానని అన్నారు.


 

ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, నాగార్జున, సుమిర్, నెమతే, అమనుల్లా, సలాం తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: