సలాం కేసులో సీబీఐ విచారణ చేపట్టే వరకు అండగా నిలవండి
నారా లోకేష్ కు జానోజాగో సంఘం నేత సయ్యద్ నిసార్ అహ్మద్ వినతి
నారా లోకేష్ కు వినతిపత్రం అందజేసిన జానోజాగో సంఘం నేత సయ్యద్ నిసార్ అహ్మద్
(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)
నంద్యాల అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసు విషయంలో సీబీఐ విచారణ జరిగే వరకు అండగా నిలవాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ కోరారు. గుంటూరుజిల్లా పర్యటనలో ఉన్న నారాలోకేష్ ను సయ్యద్ నిసార్ అహ్మద్ ఓ వినతి పత్రం అందించారు. అబ్దుల్ సలాం కేసులో పోలీసులపై నామ మాత్రపు కేసులు పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకొందని, ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ జోక్యం చేసుకోవాలని నారా లోకేష్ ను సయ్యద్ నిసార్ అహ్మద్ కోరారు.
దీనిపై స్పందించిన నారా లోకేష్ తమ డిమాండ్ కూడా అదేనని, కానీ ఈ ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదన్నారు. కేవలం న్యాయం చేస్తామన్న ప్రభుత్వం ఇచ్చిన హామీతో తాము సంతోషపడటంలేదన్నారు. సీబీఐ విచారణ కోసం ప్రభుత్వం లిఖిత పూర్వకహామీ ఇస్తేనే తాము నమ్ముతామని, అంతవరకు మీ పోరాటానికి అండగా నిలుస్తాని నారాలోకేష్ హామీ ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లింల జనాభా దామాషా ప్రకారం ముస్లిం అభ్యర్థులకు టీడీపీ తరఫున టిక్కెట్లు కేటాయించాలని నారా లోకేష్ ను ఈ సందర్భంగా జానోజాగో సంఘం నేత సయ్యద్ నిసార్ అహ్మద్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
Post A Comment:
0 comments: