అక్కడ స్పీడ్ బ్రేకర్లు వెయ్యండి.....

చిన్నారుల ప్రాణాలు కాపాడండి 

జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేది ) సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ మౌలాలి  డిమాండ్ 

 స్పీడ్ బ్రేకర్ కోసం చిన్నారుల ధర్నాకు జానో జాగో మద్దతు



( జానో జాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

స్పీడ్ బ్రేకర్లు వేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక) సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ మౌలాలి డిమాండ్ చేశారు. తర్లుపాడు మండల కేంద్రంలోని నాయుడుపల్లి కాలనీ మొదటిలో స్పీడ్ బ్రేకర్లు వేయండి అంటూ చిన్నారులు ధర్నాచేశారు.

షేక్ మౌలాలి

 ఈ ధర్నాకు జానో జాగో సంఘం మద్దతు పలికింది. ఈ మధ్యకాలంలో వాహనాలు అధికమయ్యాయి వాహనదారులు ఇష్టా రాజ్యంగా అధిక వేగంతో వెళ్తుంటారు. అయితే నాయుడుపల్లి కాలనీ లో దాదాపుగా 40 కి పైగా చిన్నారులు ఉన్నారు. నాయుడుపల్లి కాలనీ తర్లుపాడు మార్కాపురం వెళ్లేదారిలో తరచుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.అధికారులకు గతంలో అర్జీలు ఇచ్చిన కూడా ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. దయచేసి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవలసిందిగా జానో-జాగో రాష్ట కమిటీ సభ్యులు షేక్. మౌలాలి విజ్ఞప్తి చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: