పేదల సొంతింటి కలను సాకారం చేసిన జగనన్న ప్రభుత్వం

పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను తనకల గా భావించి ఆ కలను నేడు సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి కొనియాడారు. సోమవారం తర్లుపాడు - తుమ్మలచెరువు రోడ్డులోని ఖాలి స్ధలంలో వైసిపి నాయకులు సూరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యములో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి గారి చేతుల మీదుగా ఇల్లు లేని పేదలకు ఇంటిస్థలం పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని రాష్ట్ర ముఖ్య‌మంత్రి  వై.ఎస్‌.జ‌గన్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన న‌వ‌రత్నాల్లో భాగంగా పేద‌లంద‌రికీ ఇళ్లు పేరుతో రాష్ట్రంలోని ప్ర‌తి అర్హులైన నిరుపేద‌కు ఇంటి స్థ‌లంతోపాటు ఇళ్లు నిర్మించుకొనేందుకు అవ‌స‌ర‌మైన ఆర్ధిక స‌హాయం అందించేందుకు రాష్ట్ర‌‌ ప్ర‌భుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.





పట్టణ, వార్డు స‌చివాల‌యాల ద్వారా గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో  అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలఈ లేవుట్లలో మంజూరు చేసే ఇళ్ల ప‌ట్టాల‌న్నీ కుటుంబంలోని మ‌హిళ‌ల పేరుతోనే అందించడం మహిళల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో తెలుసుకోవాలని కోరారు. 2009లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదలకు258 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు 1972- 2019 వరకు 440 ఎకరాలు మాత్రమే ఇళ్లస్థలాలు కేటాయించారన్నారు కానీ 2020లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 496 ఎకరాలు సేకరించి  25 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించడమే కాకుండా ఇల్లు నిర్మించుకోవడానికి మొదటి విడతలో 15 వేల మందికి అనుమతులు ఇచ్చారన్నారు కులం మతం రాజకీయాలు పక్కనపెట్టి అర్హత గల నిరుపేదలకు ఇళ్లను మంజూరు చేయడమే మా ఉద్దేశమని తెలిపారు ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని నా ద్వారా చేపట్టినందుకు సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమములో వైసిపి నాయకులు సూరెడ్డి సుబ్బారెడ్డి, బాషాపతిరెడ్డి, మండల తహసిల్దార్, ఎం డి ఓ ఎస్. నరసింహులు గ్రామ పంచాయతీ సెక్రెటరీ బట్టు శ్రీనివాసులు, వీఆర్వో రమణారెడ్డి, హౌసింగ్ కార్పోరేషన్ ఎ.ఇ., వైసిపి నాయకులు గాయం బొర్రయ్య, మీర్జా పేట రామిరెడ్డి, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.














 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: