అబ్దుల్ సమద్, కవి మహబూబ్ బాషాను...

 సన్మానించిన కాంగ్రెస్ పార్టీ

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

అంతర్జాతీయ మైనార్టీ హక్కుల దినోత్సవాన్ని నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి షేక్ మస్తాన్ అధ్యక్షుతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల మోహనరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వాసు ఆధ్వర్యంలో నంద్యాల జమాఆతె ఇస్లామీ కార్యదర్శి, సామాజిక సేవకులు షేక్ అబ్దుల్ సమద్ , కవి షేక్ మహబూబ్ బాషాను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో జాన్ జాగో జాతీయ కార్యదర్శి మహబూబ్ బాషా, ఐయూయంయల్ నాయకులు ఖాజా, అక్బర్ ఖాన్, అబ్బాస్ కాంగ్రెస్ నాయకులు ఇలియాస్, ఖాసిం, జఇహి నాయకులు ఫయాజ్, నవాజ్ ఖాన్ పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా సీ. మోహన్ రావు సమద్ సేవలను ప్రశంశిస్తు నిరంతరం సమాజ సేవ, మైనార్టీల అభివృద్ధి కోసం తపించే సమద గారి లాంటీ మైనార్టీ నాయకున్ని సత్కరించడం గర్వంగా ఉందనీ, మహబూబ్ బాషా కవిగా సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. సత్కారానికి ధన్యవాదాలు తెలుపుతూ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ద్వారా మరీ ముఖ్యంగా పిసీసీ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా సత్కరించ బడటం ఆనందంగా ఉందనీ, ఇదీ మంచి సంప్రదాయం అన్నారు. మ్యానిఫెస్టోలో రంగనాధమిశ్రా నివేదికలు అమలుకు వాగ్దానం చేయాలన్నారు. దేశంలో బీజేపీ పాలనలో మైనార్టీలు అభధ్రతా భావనకు లోనై ఉన్నారని. దేశవాసులకు ప్రత్యామ్నాయ పార్టీలకోసం ఎదురు చూస్తున్నాయన్నారు. సమావేశంలో కవి మహబూబ్ బాషా, కాంగ్రెస్ వాసు, జాన్ జాగో మహబూబ్ బాషా, ముస్లింలీగ్ ఖాజా తదితరులు మాట్లాడారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: