తెలుగులో ఒరిజినల్‌ కామెడీ షో....

శ్రీ కామ్‌దేవ్‌ ప్రసన్నను ప్రారంభించిన  హంగామా ప్లే

తెలుగుతో పాటుగా ఈ షో వివిధ భాషల్లో కూడా...

తమిళం, కన్నడ, భోజ్‌పురి, హిందీ, మరాఠీ భాషలలో సైతం అందుబాటులో

ఇతర భాగస్వామ్య నెట్‌వర్క్‌లపై లభ్యం

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

హంగామా డిజిటల్‌ మీడియా కు సొంతమైన సుప్రసిద్ధ వీడియో ఆన్‌ డిమాండ్‌ ప్లాట్‌ఫామ్‌, హంగామా ప్లే నేడు తెలుగులో ఒరిజినల్‌ కామెడీ షో ‘కామ్‌దేవ్‌ ప్రసన్న’ను ప్రారంభించింది.  అమ్మాయింటే సిగ్గుపడే 35 ఏళ్ల వయసున్న సిగ్గరి మిలింద్‌ యొక్క దురదృష్టం చుట్టూ ఈ షో తిరుగుతుంటుంది. దైవం జోక్యం తప్పుగా జరగడంతో, ప్రేమ ప్రతిరూపమైన భగవంతుడు కామ్‌దేవ్‌ను మిలింద్‌కు సహాయపడాల్సిందిగా భూమికి పంపుతారు. దీనితో మిలింద్‌ జీవితం హాస్యాస్పదంగా మారుతుంది, అయినప్పటికీ ఈ ప్రక్రియలో భగవంతుడు అతని స్నేహితునిగా మారతాడు. నేటినుంచి ఈ షో హంగామా ప్లే మరియు భాగస్వామ్య నెట్‌వర్క్‌లపై లభ్యమవుతుంది. వినియోగదారులు హంగామా ప్లే యాప్‌ను గుగూల్‌ ప్లే, యాపిల్‌ ప్లే స్టోర్‌ మరియు హువే యాప్‌ గ్యాలరీలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ షో అత్యంత సిగ్గరి అయిన మిలింద్‌ కథను అనుసరిస్తుంది. ఇతను అమ్మాయిలతో అస్సలు మాట్లాడడు. అతని తల్లి అయితే ఇతనికి తగ్గ అమ్మాయిని తన జీవితంలో చూడలేమోనని ఆందోళన చెందుతుండటమే కాదు, కృష్ణ భగవానుని తన కుమారునికి సహాయపడవలసినదిగా ప్రార్ధిస్తుంటుంది. అత్యంత హాస్సాస్పదమైన పరిస్థితిలో యమధర్మరాజు సహాయకుడు అయిన చిత్రగుప్తుడు ఆమె ప్రార్థనలు విని, మిలింద్‌కు సహాయంగా భగవంతుడైన కామ్‌దేవ్‌ను పంపాలని నిర్ణయించుకుంటాడు. కామ్‌దేవ్‌ నేర్పించిన మంత్రం సహాయంతో మిలింద్‌ అసాధారణమైన బహుమతి పొందుతాడు. దీని కారణంగా అతను అదృశ్యం కావడంతో పాటుగా తన చుట్టూ ఉన్న అమ్మాయిల మనసులను సైతం చదివే శక్తి పొందుతాడు. అయితే, ఇక్కడే ఓ అనుకోని సంఘటన ! అతనిలో కామోద్రేకం కలిగితే అతను మరలా కనిపించడం మొదలు పెడతాడు ! కామ్‌దేవ్‌ యొక్క సహాయం, మిలింద్‌కు ఓ వరంలా ఉన్నప్పటికీ, ఈ పరిస్థితులను అతను హాస్యాస్పదంగా అధిగమిస్తాడు. కానీ మిలింద్‌ తాను ప్రేమించే శివానీ ప్రేమను గెలుచుకోవడంలో కామ్‌దేవ్‌ సహాయపడతాడు. ఈ ఇద్దరూ బలీయమైన బంధం ఏర్పరుచుకోవడంతో పాటుగా అసలైన స్నేహాన్నీ కనుగొంటారు. ఈ షోలో భౌ కదమ్‌, సాగర్‌ కరాండీ, భాగ్యశ్రీ మోతీ, వినయ్‌ యెదేకర్‌ మరియు ఆశా షెలర్‌ నటించగా,  కేఫ్‌ మరాఠీ నిర్మించింది. ఈ షోకు సందీప్‌ నవారీ దర్శకత్వం వహించారు.

ఈ షో గురించి సిద్ధార్థ రాయ్‌, సీఓఓ, హంగామా డిజిటల్‌ మీడియా మాట్లాడుతూ ‘‘ హంగామా ప్లే వద్ద మా లక్ష్యం ఎప్పుడూ కూడా వినోదాత్మకంగా ఉంటూనే, ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకుంటూ, స్థానిక సంస్కృతిలో లోతుగా మిళితమైన కథలను చెప్పడం. అసాధారణ పరిస్థితులను వినోదాత్మంగా చూపడమే శ్రీ కామ్‌దేవ్‌ ప్రసన్న. అద్భుతమైన ప్రదర్శనలుతో కూడిన ఈ షో ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మా ప్లాట్‌ఫామ్‌పై గణనీయమైన తోడ్పాటును తెలుగు అందిస్తుంది మరియు ఈ భాషలో పలు ఒరిజినల్‌ షోలను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము మరియు రాబోయే సంవత్సరం నాటికి ఈ ప్రాంతంలో మా వినియోగదారుల సంఖ్యను రెండు రెట్లు వృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా చేసుకున్నాం’’ అని అన్నారు.

నిఖిల్‌ రాయ్‌బోలీ, కో–ఫౌండర్‌ అండ్‌ సీఈవో–కేఫ్‌ మరాఠీ  మాట్లాడుతూ ‘‘కేఫ్‌ మరాఠీ వద్ద మా లక్ష్యం వినోదాత్మకంగా ఉంటూనే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా  కంటెంట్‌ను తీర్చిదిద్దడం. శ్రీ కామ్‌దేవ్‌ ప్రసన్న ఓ కామెడీషో. మొదటి సీన్‌ నుంచి వీక్షకులకు ఆసక్తిని ఇది రేకెత్తిస్తుంది. హంగామా ప్లేతో కలిసి పనిచేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది తెలుగు వీక్షకులకు ఈ షో ద్వారా చేరుకోగలదని ఆశిస్తున్నాము’’అని అన్నారు.

ఈ షో ఇప్పుడు హంగామా ప్లే, హంగామా యొక్క వీడియో ఆన్‌ డిమాండ్‌ ప్లాట్‌ఫామ్‌పై ప్రసారం అవుతుంది. శ్రీ కామ్‌దేవ్‌ ప్రసన్న ఇప్పుడు ఎంఎక్స్‌ ప్లేయర్‌పై హంగామా ప్లే , ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌, వీ మూవీస్‌ అండ్‌ టీవీ, అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌, టాటా స్కై బింగీ,  డిష్‌స్మార్ట్‌ స్టిక్‌, డీ2హెచ్‌ స్ట్రీమ్‌, డిష్‌స్మార్ట్‌హబ్‌, ఐఎస్‌పీలు అయినటువంటి మేఘ్‌బేలా బ్రాడ్‌బ్యాండ్‌, అలయన్స్‌ బ్రాడ్‌బ్యాండ్‌, యాక్ట్‌ ఫైబర్‌నెట్‌, నెట్‌ప్లస్‌ మరియు స్మార్ట్‌ టీవీలు అయిన టీసీఎల్‌, ఒన్‌ప్లస్‌ టీవీ, సోనీ బ్రావియా, సీవీటీఈ, తోషిబా, క్లౌడ్‌ వాకర్‌లలో కూడా ప్రసారమవుతుంది. అదనంగా షావోమీతో హంగామా యొక్క భాగస్వామ్యంతో వినియోగదారులు ఈ షోను ఎంఐ టీవీపై హంగామా ప్లే ద్వారా చూడవచ్చు,

Watch the trailer here – https://bit.ly/3gW6wFe 

Watch the show here – https://bit.ly/2KmKwqK

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: