రైతు వ్యతిరేక చట్టాలకు స్వస్తి పలకండి

వామపక్ష రైతాంగ విభాగాల ఆధ్వర్యంలో దీక్షలు

సంఘీభావంగా దీక్షల్లో పాల్గొన్న జానోజాగో...ఐయూఎంఎల్...గిరిజన ప్రజా సంఘాలు

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిది)

కేంద్రం తీసుకొచ్చిన నష్టపూరిత వ్యవసాయ చట్టాల రద్దుకై వామపక్ష రైతాంగ పార్టీలు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయి. వ్యవసాయ సంఘం అధ్యక్షులు నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘీభావంగా ముస్లిం, గిరిజన ప్రజా సంఘాలు కూడా పాల్గొన్నాయి. ఈ సందర్బంగా బుధవారంనాడు జరిగిన  నిరాహార దీక్ష లో జానో జాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాష, ఐ యు ఎం ఎల్ ఏ జిల్లా కార్యదర్శి కలాం మౌలానా, గిరిజన సమైక్య సంఘము కార్యదర్శి నరసింహులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న ముస్లిం, గిరిజన ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ
రైతులకు మద్దతుగా దీక్షల్లో పాల్గొని ప్రసంగిస్తున్న జానోజాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా
 
సంఘీభావంగా దీక్షల్లో పాల్గొన్న జానోజాగో...ఐయూఎంఎల్...గిరిజన ప్రజా సంఘాలు
రైతు కంట కన్నీరు కార్చిన ప్రభుత్వము బాగు పడినట్లు చరిత్రలో లేదు అలాగే వ్యవసాయ చట్టాల రద్దు అనేక మంది రైతులు తమ మాన ప్రాణాలను సైతం లెక్క చేయక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న అకుంఠిత దీక్షతో తమ సమ్మెను 30 రోజుల నుండి కొనసాగిస్తున్న అప్పటికిని నిమ్మకు నీరెత్తినట్టు చూస్తుంది వ్యవసాయ చట్టాల ముఖ్య ఉద్దేశం బడా కార్పొరేటు సంస్థలకువ్యవసాయ న్ని అప్పజెప్పడం దాని వలన ఆ దాని అంబానీలకు లబ్ధి చేకూర్చడం ఇందులో ధరల స్థిరీకరణ ఉండదు కనీస మద్దతు ధర లభించదు వ్యవసాయము అనునది కార్పొరేట్ సంస్థలకు వెళ్ళినప్పుడు వ్యవసాయ స్వేచ్ఛా వాణిజ్యం ఉండదు ధరలను నిర్ణయించే శక్తిని రైతు కోల్పోతాడు కావున దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మేధావులు ప్రజా సంఘాలు ఈ పెనుముప్పు ను అడ్డుకోకపోతే రైతు వ్యవస్థ నిర్వీర్యమై ఆర్థిక ప్రగతికి అవాంతరం ఏర్పడుతుంది కావున వామపక్షాలు ప్రజాస్వామ్యవాదులు ఈ మూడు వ్యవసాయ చట్టాలను రద్దుకై తమ వంతు ప్రయత్నం చేయకపోతే భారతదేశ రైతాంగం వలలో చిక్కుకున్న చేప పిల్లల వలె విలవిలలాడక  తప్పదు  ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రభుత్వము రైతు వ్యవసాయ చట్టాలే కాదు పౌరసత్వ చట్టాలతో  చెలగాటమాడుతు ఈ దేశ మూల వాసులను నిర్వీర్యం చేయుటకు సమాయత్తమవుతున్నది.
స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థలను సర్వనాశనం చేయడానికి కంకణము కట్టుకున్నది మనువాద మతఛాందస రాజ్యస్థాపనకు నిరాటంకంగా ప్రయత్నం చేస్తుంది మూక దాడులతో బడుగు బలహీన వర్గాల పై ధ్వజమెత్తుతూ ఉన్నాయి సామాజిక సమన్యాయం ఆర్థిక విచ్చిత్తికి దోహదం చేసే విధంగా బడా పారిశ్రామిక వేత్తలకు అప్పచెప్పి దేశ భవిష్యత్తును  క్రుంగ తీయటానికి సమాయత్తమవుతున్న ది. ఈ ధర్నా కార్యక్రమంలో  సిపిఎం సద్దాం హుస్సేన్ ఆవాజ్ జిల్లా కన్వీనర్మస్తాన్ వలీ సిపిఎం నాయకులు రమేష్  సిపిఐ నాయకులు బాబా ఫక్రుద్దీన్ సిపిఎం నాయకులు మద్దులు మొదలగు వారు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: