ఆ జీవోలను రద్దు చేయాలి

ప్రజలపై భారం మోపడం అమానుషం

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కందుల నారాయణ రెడ్డి డిమాండ్ 

ఆర్డీఓకు వినతిపత్రం అందజేత

మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-ప్రకాశం, గుంటూరు బ్యూరో)         

“కరోన వైరస్ “ కారణంగా ఉపాధి కోల్పోయి ప్రజలు కష్టాల్లో ఉండగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని పట్టణ ప్రజల పై ఇంటిపన్ను, నీటిఛార్జీలు పెంచి, ఇంకా డ్రైనేజీ చార్జీలు అంటూ ప్రజలపై భారంమోపడం అమానుషమని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కందుల నారాయణరెడ్డి విమర్శించారు. వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు   దయచేసి ప్రజలపై భారం కాబోతున్నా ఈ ఆర్డినెన్సు16, జీవోలు 196,197 లను ప్రభుత్వంఉపసంహరించుకోవలసిందిగా  తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్ఛార్జీ కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యములో శనివారంనాడు ఆర్.డి.ఓ.కు  వినతి పత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గోన్నారు.ఈ వినతి పత్రంలోని సారాంశం ఇలావుంది.... రాష్ట్రంలోని వైఎస్ఆర్ ప్రభుత్వం  యుద్ధప్రాతిపదిక మీద ఆర్డినెన్స్ నంబర్ 16  నిన్న విడుదల చేసి  మున్సిపల్ చట్టాలను సవరించింది.

ఈ సవరణ ప్రకారం 2021 ఏప్రిల్ నుండి అద్దె విలువ ఆధారంగా కాకుండా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధిస్తారు.  దీనివలన  పది రెట్లు వరకు ఆస్తి పన్ను (ఇంటిపన్ను) పెరిగే ప్రమాదం ఉంది. నెలకు నివాసాలపై 350 రూపాయల వరకు నీటి ఛార్జీలు వసూలు చేయడానికి ఆదేశాలు ఇచ్చింది.అంతేకాకుండా నీటి మీటర్లు ఆధారంగా అపార్ట్మెంట్లు , వ్యాపార సంస్థలు నుండి  లీటర్ల చొప్పున వెయ్యి లీటర్ల కు 30 నుండి 140 రూపాయల వరకు పెంచటానికి జీవోల ద్వారా అవకాశంకల్పించారు. కరోనా సమయంలో ప్రజల కళ్ళుగప్పి  తెచ్చిన ఈ సంస్కరణలు ప్రజలకు ఉపశమనం కలిగించేవి కాకుండా ప్రజల నడ్డి విరిచేలా వున్నాయి.ఇదే కాకుండా మంచినీరు,మురుగునీరు నిర్వహణ ఖర్చు మొత్తం ప్రజల నుండి రాబట్టే  విధంగా  196, 197 జీవోలను నిన్ననే విడుదల చేసింది. ఒకవైపున తెలంగాణ ప్రభుత్వం కరోనా ఉన్నందున ఈ సంవత్సరం ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ ప్రభుత్వం, ఇంటి పన్నులు పెంచడం అన్యాయం. ఇవే కాకుండా ప్రతి సంవత్సరం 15 శాతం వరకు మంచినీరు, డ్రైనేజీ ఛార్జీలు పెంచుకోవడానికి కూడా అధికారం కల్పించారు.  అంతేకాకుండా ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ శాఖ ప్రకటించే భూముల విలువల ఆధారంగా ఎప్పటికప్పుడు పన్నులు పెరుగుతాయి.  దీని వలన పది రెట్లు ఇంటి పన్ను పెరిగే అవకాశం వుంది. మున్సిపాలిటీలను వ్యాపార సంస్థలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుస్తున్నాయి. పౌర సదుపాయాలను వ్యాపార సరుకులుగా మార్చుతున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగి కౌన్సిళ్లు ఏర్పడి మున్సిపాలిటీలలో స్థానిక  పన్నుల విషయం నిర్ణయించాల్సి ఉండగా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అసెంబ్లీ సమావేశాలలో చర్చించకుండా ఏకపక్షంగా ఆర్డినెన్స్ ద్వారా హడావిడిగా చట్టాలు సవరించడం శోచనీయం. స్థానిక సంస్థల స్వయం సమృద్ధి పేరుతో నిధులు ఇవ్వాల్సిన బాధ్యత నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకొని ప్రజలపై భారాలు వేయడం ప్రజా వ్యతిరేక చర్య. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఏప్రిల్ నుండి అమలు పరచడానికి ప్రభుత్వాలు  సిధ్ధంగా ఉన్నాయి. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. అని ఆయన పేర్కొన్నారు.

రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్

ప్రకాశం, గుంటూరు జిల్లాల బ్యూరో చీఫ్





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: