జగన్ సరికొత్త రికార్డ్

జంకే వెంకట రెడ్డి

జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏ.పి.ఎన్.జి.ఓ. అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసరావు 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

       ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి జగన్  మోహన్  రెడ్డి  జన్మదినం సందర్భంగా  హైదరాబాద్  లో తెలంగాణ రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డితోపాటు ప్రకాశం జిల్లా  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  పార్టీ కార్యదర్శి, మార్కాపురం నియోజక వర్గ మాజీ  శాసనసభ్యులు,  జంకే  వెంకట  రెడ్డి కేట్ కట్ చేశారు.  ఈ సందర్భంగా మార్కాపురం నియోజక వర్గం మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డిగారు మాట్లాడుతూ   సంక్షేమ పథకాల అమలులో రికార్డ్ సాధించిన సీఎం జగన్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి జగన్  రికార్డ్ సాధించారని, ప్రజా సంక్షేమానికి తండ్రి వై ఎస్ ఆర్ ఒకడుగు  ముందుకేస్తే జగన్ రెండడుగులు ముందుకేస్తున్నారన్నారు. రూ 74 వేల కోట్ల నిధులను సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాలలోకే అందచేసారన్నారు.
 ఏ.పి.ఎన్.జి.ఓ. అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసరావు 
కరోనా విపత్కర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సీఎం జగన్ అండగా నిలబడుచున్నారన్నారు. కోవిడ్ నిర్దారణ పరీక్షలలో దేశంలోనే ఆదర్శంగా ప్రభుత్వం నిలిచిందన్నారు. రైతుల పక్షపాతిగా జగన్ నిలుస్తున్నారన్నారు. పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు.ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు ధీటుగా అభివృద్ధి చేస్తూ ప్రజల గుండెల్లో జగన్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. ఈ కార్యక్రమములో పాల్గోన్న ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసరావు తమ అసోసియేషన్ తరపున ముఖ్యమంత్రి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: