ఆర్యవైశ్యల ఆధ్వర్యంలో....
ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశంజిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో ఆర్యవైశ్యల ఆధ్వర్యాన మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.స్థానిక పొట్టి శ్రీరాములు పార్క్ లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా స్థానిక ఆర్యవైశ్య పెద్దలు మాట్లాడుతూ త్యాగశీలి శ్రీ పొట్టి శ్రీరాములు అని అన్నారుతెలుగువారి కోసం పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అన్నారు.ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం అర్పించిన మహోన్నత వ్యక్తి అమర జీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు . తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంలో వుండాలని ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష సలిపిన త్యాగ శీలి,అంకుఠత దీక్షాపరుడ న్నారు.విద్యార్థులు ఆయన పట్టుదల కృషిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఆదర్శమూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు లాగా తాము కూడాసమాజానికి భవిష్యత్తులో ఉపయోగపడతామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో దోగిపర్తి మల్లికార్జున్,జవాజి వెంకటేశ్వర్లు,జవాజి జనార్ధన్,చక్క బాల రంగం,చక్క చెన్నయ్య, పూర్ణయ్య,సిహెచ్ సుబ్రమణ్యం,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: