ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త....

వాచస్పతి ఎ.ఎస్.మూర్తి కన్నుమూత

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త, వాచస్పతి ఎ.ఎస్.మూర్తి మంగళవారం ఉదయం 8 గంటలకు ఖైరతాబాద్  ఆనంద్ నగర్ కాలనీ లోని వారి ఇంట్లో గుండెపోటు తో కనుమూశారు!  వారి వయసు 84. ఎలక్ట్రికల్ బోర్డు లో ఉన్నతాధికారిగా  పదవీ విరమణ పొంది, దోమలగూడ రామకృష్ణ మఠం లోని వివేకానంద ఇన్స్టిట్యూట్ లో డిప్యూటీ   డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. వంశీ, కిన్నెర, రసమయి సంస్థలు  నిర్వహించే ప్రతి కార్యక్రమానికి వారు సభా సమన్వయము చేసి, సాంస్కృతిక రంగం లో విశేష సేవలు అందించారు. మహాత్మా గాంధీ, వివేకానంద జీవిత చరిత్రలను రచించారు.వారు రచించిన ఆర్ట్ లవర్స్ పుస్తకం మంచి ప్రాచుర్యం పొందింది. అందరితో ఆత్మీయంగా వుంటూ బాగా  ప్రోత్సహించే   గొప్ప స్ఫూర్తి ప్రదాత! నాకు అత్యంత ఆత్మీయులు!  నన్ను, నా రాతలను బాగా ఇష్టపడే వారు!  "స్వాతంత్ర్యానికి ముందు ఆ తరువాత జర్నలిజం"  అనే టాపిక్ ను నా PhD కి సూచించడమే కాకుండా, అనేక  క్లిప్పింగ్స్ ఇచ్చి నా డాక్టరేట్ కు దోహదపడ్డారు!  వారు జాతీయ స్థాయి వక్త!  ప్రముఖులందరికో  మెంటార్ !  రవీంద్రభారతి ప్రజా సంబంధాల అధికారి గా పని చేసారు!  కిన్నెర టూర్స్ లో వారితో కలసి చేసిన పాపి కొండలు ప్రయాణం ఎప్పుడూ వెంటాడే అనుభూతి!  వారు లేని  లేని  లోటు తీరనిది! అశ్రు నివాళి

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: