బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించండి

విద్యార్థి, యువజన సంఘాల పిలుపు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రేపు జరిగే బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి, కేజీ నుంచి పీజీ వరకు అన్ని రకాల విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు బంద్ సహకరించాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పిడిఎస్ యూ, పీవైఎల్  గిరిజన విద్యార్థి సమాఖ్య,బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య సంఘాల నాయకులు కోరారు. ఏఐవైఎఫ్  రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగ రాముడు, పీడీఎస్ యూ జిల్లా  సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ..రఫీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ధనుంజయుడు, ఎఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, పి వై ఎల్ జిల్లా నాయకులు నవీన్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమైక్య జిల్లా అధ్యక్షులు శివ కృష్ణ యాదవ్, జీవిఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్, ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగానికి తూట్లు పొడుస్తూ రైతు వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తు,మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయాన్ని ప్రైవేటు పరం చేస్తూ,విద్యా,వైద్యం,ఉపాధి హక్కులను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రైతు సంఘాలు,అన్ని వామపక్ష పార్టీలు రేపు నిర్వహిస్తున్న దేశవ్యాప్త బంద్ కు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పిడిఎస్ యూ, పీవైఎల్ గిరిజన విద్యార్థి సమాఖ్య,బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య సంఘాల సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు ఈ రోజు మధ్యాహ్నం సీపీఐ కార్యాలయంలో  జరిగిన ఆ సంఘాల నాయకులు ముఖ్య నాయకుల సమావేశంలో ఆ సంఘాల నాయకులు పత్రిక ప్రకటన విడుదల చేసారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: