నంద్యాల కూరగాయల మార్కెట్ పై చిన్న చూపు ఎందుకో

 మా ఆకలి బాధలు మీకు పట్టవా?

 నంద్యాల కూరగాయల మార్కెట్ వ్యాపారులు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల కూరగాయల మార్కెట్ పై చిన్న చూపు ఎందుకని, మా ఆకలి బాధలు మీకు పట్టవా అంటూ నంద్యాల కూరగాయల మార్కెట్ వ్యాపారస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నంద్యాల గాంధీచౌక్ లోని కూరగాయల మార్కెట్ నందు పాత రేకుల షెడ్డును కూల్చేందుకు మునిసిపల్ అధికారులు రాగా వ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం కూరగాయల మార్కెట్ వ్యాపారులు మాట్లాడుతూ ఎన్ని సార్లు వాయిదాలతో మమ్మ లను మభ్య పెడతారని, పడగొట్టిన రూమ్ లకే దిక్కు లేదని, తిరిగి ఈ రోజు మరోసారి పడగొట్టడానికి వచ్చిన అధికారులపై వ్యాపారాలు విరుచుకు పడ్డారు. అసలు కూరగాయల మార్కెట్ ఉందా లేక రిలయన్స్ వారికి అప్పజెపుతారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ నెల 26 వ తేదీ కూరగాయల మార్కెట్ ఓపెన్ చేస్తాము అంటూ  వ్యాపారస్తులు మీడియాతో పేర్కొన్నారు. ఈ సారి కమిటీ పెద్దల మాట కూడా వినమంటూ వ్యాపారస్తులు చెబుతున్నారు. 



కర్నూలు జిల్లా నంద్యాలలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ పై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి, మార్కెట్ను అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్దాం అని చెప్పిన అధికారులు,  నాయకులు చెప్పిన మాటలకు వారి మాటలు నమ్మి మోసపోయామా అని వ్యాపారస్తులు తలలు పట్టుకుంటున్నారు. కూరగాయల మార్కెట్ ను కొత్తగా రీ మోడలింగ్ చేసి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారా లేదా అన్న దోరణిలో వ్యాపారులున్నారు. ఇప్పటికే మార్కెట్ ఓపెనింగ్ మూడుసార్లు పెండింగ్ వేస్తున్న అధికారులపై మండిపడుతున్న కూరగాయల వ్యాపారస్తులు ఈనెల 26వ తేదీ అధికారులు అనుమతించినా..  లేకున్న మేము కూరగాయల మార్కెట్ ఓపెన్ చేస్తాము అని వ్యాపారస్తులు ఘాటుగా సమాధానం చెప్పారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: