డిప్యూటీ సీఎం అంజాద్ భాష కు ఘన స్వాగతం

(జానోజాగో వెబ్ న్యూస్-ఎర్రగుంట్ల ప్రతినిధి)

ఎర్రగుంట్ల డిసెంబర్ 8: వైసిపి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ  జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భారీ అనుచరగణం తో డిప్యూటీ సీఎం అంజాద్ బాష కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన వైసిపి మైనార్టీ నాయకులకు కార్యకర్తలు కలిసి వారి సమస్యలను తెలుసుకొని వారు ఇచ్చిన వినతిపత్రాలను డిప్యూటీ సీఎం స్వీకరించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ మైనారిటీలకు పెద్ద పీఠం వేసిన ఏకైక ప్రభుత్వం  వైసిపి ప్రభుత్వం అన్నారు. అలాగే మసీదుల అభివృద్ధి కొరకు నిధులు కూడా మంజూరు చేస్తున్నారని మసీదు మతపెద్దలకు గురువులకు వేతనాలు కూడా ఇస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హర్ష వర్ధన్ రెడ్డి వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: