ఇండ్ల పట్టాలను పంపిణీ చేసిన 

నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాలశాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి శనివారం  ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. నంద్యాల మండలం పోలూరు గ్రామంలో  నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, నంద్యాల తాసిల్దార్ రవికుమార్, నంద్యాల డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ భాస్కర్లతో కలసి నవరత్నాలు - పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇండ్ల పట్టాలు పంపిణీ గావించారు. అనంతరం నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  క్రిస్మస్ పండుగ వైకుంఠ ఏకాదశి శుక్రవారం శుభ దినమున నిరుపేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరుపుకునేలా చేసినందుకు నంద్యాల నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు.
మన నియోజకవర్గంలో 1976 పట్టాలను పంపిణీ గావిస్తున్నామని,  ఒక పోలూరు గ్రామంలొనే ఒకటిన్నర సెంటు ప్రకారం 136 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామని,మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేద అక్కాచెల్లెమ్మళ్లకు ఇళ్ల పట్టాల పంపిణీ గావించడం బృహత్తర కార్యక్రమమన్నారు. మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఇటువంటి కార్యక్రమం నేటి నుండి 15 రోజులపాటు పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 76 వేల ఇళ్ల పట్టాలు స్థలాలు పంపిణీ గావించుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇళ్లు లేని అక్కచెలమ్మలందరికీ 17,005 వైయస్ఆర్ జగనన్న కాలనిలలో లెఔట్లు వేసి ఇండ్ల స్థలాలు ఉచితంగా అందిస్తున్నారని, అదే కాలనీలో సుమారుగా రు 6800 కోట్ల వ్యయంతో త్రాగునీరు .రోడ్లు. డ్రైనేజీ .విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నారని, ఆ స్థలం లోనే ఉచిత పక్కా ఇళ్లను కూడా నిర్మించనున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదలందరికి శాశ్వత గృహ వసతి కల్పించాలన్న ఉద్దేశంతో రెండు దశల్లో 28 లక్షల 30 వేల ఇళ్లు మొదటి దశలో 28,080 కోట్ల రూపాయల వ్యయంతో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి నేటి నుండి మన ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇల్లులేని పేద అక్క చెల్లెమ్మలకు రు21.345 కోట్ల విలువగల 2.62 లక్షల టిడ్కో ఇళ్లను సేల్ అగ్రిమెంట్ కూడా ఇదే రోజు అందించనున్నట్లు తెలిపారు. మన ప్రభుత్వం నిర్మిస్తున్నది కేవలం ఇండ్లు కావని,  అవి ఊర్లుగా వేదాజిల్లుతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి రమణయ్య, నంద్యాల తహసీల్దార్ రవికుమార్, నంద్యాల డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ భాస్కర్,  నంద్యాల భాష్యం జగదీశ్వర్ రెడ్డి, విజయశేఖర్ రెడ్డి,  గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: