టూరిజం బస్సును ప్రారంభించిన ఏ.వీ.సుబ్బారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఏ l ట్రావెల్స్ ఏసీ టూరిజం బస్సును విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఏ 1 ట్రావెల్స్ అధినేత నాగరాజు ఆధ్వర్యంలో టూరిజం యాత్రికులు కోసం ఏర్పాటు చేసిన బస్సును ఏవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు . బస్సులో సీటింగ్ ను , ప్రయాణీకులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు . ఈ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు కుటుంబ సమేతంగా , స్నేహితులతో సంతోషంగా విహాయ యాత్రలకు వెళ్లేందుకు అనుకూలంగా బస్సు ఉందన్నారు . విశాలమైన సీటింగ్ సదుపాయం ఉందని చెప్పారు . అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా బస్సు ధరలు ఉంచాలని గుర్తు చేశారు . నాగరాజు మాట్లాడుతూ నంద్యాల ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏ 1 ట్రావెల్స్ ఆధ్వర్యంలో బస్సును ఉంచామని అన్నారు . నంద్యాల ప్రాంతంలో సమీప ప్రాంత ప్రజలు బస్సును సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో బాబుల్లా , తదితరులు ఉన్నారు.


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: