ఇంటి స్థలాల పంపిణీకి సర్వంసిద్దం చేయండి
ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను సర్వ సిద్ధం చేయాలంటూ అధికార్లకు మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఆదేశించారు. మండల స్థాయి అధికారులతో పాటు మండలంలోని సచివాలయ సిబ్బంది,, గ్రామ వాలంటీర్లు విధిగా బాధ్యతలు నిర్వహించాలని తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు లోని స్త్రీ శక్తి కార్యాలయం నందు మండల అభివృద్ధి అధికారి ఎస్. నరసింహులు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి, గ్రామ వాలంటరీ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం శాసన సభ్యులు కుందూరు. నాగార్జున రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని డిసెంబర్ 25 వ తేదీన ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను సర్వ సిద్ధం చేయాలంటూ మండల స్థాయి అధికారులతో పాటు మండలంలోని సచివాలయ సిబ్బంది,, గ్రామ వాలంటీర్లు విధిగా బాధ్యతలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు. నాగార్జున రెడ్డి మాట్లాడుతూ
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పేదవాడి ఇంటి కల నెరవేరే టైం దగ్గర పడింది అని అన్నారు. ఎన్నో రోజులుగా నిరీక్షించిన ప్రజలకు ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణం కూడా పూర్తిగా కట్టించి ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి అన్ని విధి విధానాలను అమలు పరచాలని అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చేందుకు గొప్ప యజ్ఞంలా ఇంటి స్థలాల ప్రక్రియను ప్రారంభించి ఇల్లు లేని పేదవాడికి గూడు కల్పించడం జరిగిందన్నారు.
మండలంలో ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం డిసెంబర్28, జనవరి2, 6 తేదీల్లో పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంటి పట్టాల పంపిణీకి కావాల్సిన అన్ని ప్రణాళికలను మండల స్థాయి అధికారులు సర్వ సిద్ధం చేయడం జరిగిందని ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా ఇంటి స్థలం కావాలన్నా అర్హులైన లబ్ధిదారులకు సహాయం చేయాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లు సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్. నరసింహులు, ఎమ్మార్వో పి. శైలేంద్ర కుమార్, హౌసింగ్ డి ఈ పవన్ కుమార్, ఏపీ డి మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: