మంచి నీరు సరఫరాలో భరోసా కల్పించాలి

మున్సిపల్ అధికార్లకు జానోజాగో నేత షేక్ గౌస్ బాషా వినతి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురం పట్టణంలోని ప్రజలకు మంచి నీరు సరఫరా విషయంలో భరోసా కల్పించాలని మున్సిపల్ అధికార్లకు జానో-జాగో (ముస్లీంల అభివృద్ధి వేదిక), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయ కర్త షేక్ గౌస్ బాషా కోరారు. ఏలూరు ఘటన నేపథ్యంలో మార్కాపురంలోనూ ఆందోళన నెలకొందన్నారు. మార్కాపురం పట్టణంలోనూ మురుగు నీరు తాగునీరుతో కలిసి వచ్చిన ఘటనలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ మేరకు షేక్ గౌస్ బాషా ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఇలావుంది....మనకు నిత్యం శరీరానికి కావలసిన ప్రాధమిక అవసరాలలో ముఖ్యమైనది నీరు. ఏలూరు పట్టణములో గత కొన్ని రోజులనుంచి కలుషితమైన నీరు త్రాగి సుమారు నాలుగు వందలమందికిపైగా వింత వ్యాధినపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే,  ఏలూరు ఘటనతో మార్కాపురం పట్టణము, పలు ప్రాంతాలలోని ప్రజలలో ఈ మున్సిపాలిటీల ద్వారా సరఫరాచేస్తున్న మంచినీరు సురక్షితమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటె మార్కాపురం పట్టణంలో పలుసార్లు సాగర్ కాలువ ద్వారా సరఫరా అవుతున్న  మంచినీరు,  మురుగునీరుతో కలుషితమై ప్రతి ఇంటికి పైపుల ద్వారా వచ్చిన సందర్భాలు చాలా వున్నాయి.

ఈ సమస్య ఎదురయిన ప్రతి సందర్భములో పట్టణ ప్రజలు ఆ సమయాలలో వున్న మున్సిపల్ కమీషనరు దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగేది. ఈ సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు ఏమేరకు తీసుకున్నారో వారికే తెలియాలి! ఇప్పటికీ పలుసందర్భాలలో పైపుల ద్వారా మురుగునీటితో కలుషితమైన మంచినీరు వస్తూనే వున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు. మరి కొంతమంది పురపాలక శాఖావారు సరఫరా చేస్తున్న మంచినీరుపై శుభ్రత వుండవనే నమ్మకముతో , నాణ్యత ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ ప్లాంట్లపై ఆధారపడి రసాయనాలతో కూడిన కలుషితమైన నీటినిత్రాగి వారికి తెలియకుండానే అనేక రకాలైన రోగాలకు గురవుతున్నారని జానో-జాగో (ముస్లీంల అభివృద్ధి వేదిక) ఏ.పి.రాష్ట్ర సమన్వయ కర్త షేక్. గౌస్ బాష తెలియచేశారు. 

       దయచేసి సంబంధిత అధికారుల పర్యావేక్షణలో ఈ సమస్యపై సరైన పరిష్కారమార్గాలతో, పట్టణ పురపాలక కార్యాలయం వారు సరఫరా చేస్తున్న మంచినీరుపై ప్రజలకు పూర్తి భరోసా కల్పించి రాబోయే విపత్తు నుండి మార్కాపురం పట్టణ ప్రజలను రక్షించే దిశగా చర్యలు తీసుకోవలసిందిగా గౌస్ బాష విజ్ఞప్తి చేశారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: